Breaking News

స్నేహితురాలి మోజులో భార్యను.. ఆప్‌ నేత అరెస్ట్‌

Published on Tue, 02/18/2025 - 10:09

అక్రమ సంబంధాలు ఎంతటి దారుణమైన పరిస్థితులకైనా దారితీస్తాయనడానికి పంజాబ్‌లోని లుథియానాలో జరిగిన ఒక ఉదంతం ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పదిమందికీ ఆదర్శంగా నిలవాల్సిన ఒక నేత స్వయంగా అకృత్యానికి పాల్పడటం మానవత్వానికి మాయని మచ్చగా నిలిచింది.

వివరాల్లోకి వెళితే పంజాబ్‌లోని లుథియానాలో భార్యను హత్య చేసిన కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత  అనోఖ్‌ మిట్టల్‌ను స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతనితో పాటు అతని స్నేహితురాలు, మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల విచారణలో తొలుత అనోఖ్‌ మిట్టల్‌ తన భార్య లిప్సీ మిట్టల్‌ను ఒక గ్రామం దగ్గర దుండగులు హత్య చేశారని చెప్పాడు. తాను, తన భార్య లుథియానా-మలెర్‌కోట్లా రోడ్డులో ఒక హోటల్‌లో భోజనం చేసి, తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగిందని అనోఖ్‌ మిట్టల్‌ పోలీసులకు తెలిపాడు. ఆ దుండగులు మారణాయుధాలతో దాడి చేసి, తమ కారు తీసుకుని పారిపోయాడని పేర్కొన్నాడు.

పోలీస్ కమిషనర్ కుల్దీప్ సింగ్ చాహల్ మీడియాతో మాట్లాడుతూ తమ విచారణలో లిప్సీ మిట్టల్‌ను ఆమె భర్త అనోఖ్‌ మిట్టల్‌ హత్య చేశాడని విచారణలో వెల్లడయ్యిందన్నారు. అనోఖ్‌ మిట్టల్‌తో పాటు ఈ హత్యకు సహకరించిన అతని స్నేహితురాలు, మరో నలుగురిని అరెస్ట్‌ చేశామన్నారు. తన భర్తకు వివాహేతర సంబంధం ఉన్నదని లిప్సీ మిట్టల్‌కు తెలిసిపోయందని, దీంతో భయపడిన అనోఖ్‌ మిట్టల్‌ తన స్నేహితురాలి సాయంతో భార్యను హత్య చేశాడన్నారు. ఈ ఘటనలో అనోఖ్‌కు సహకరించిన అమృత్‌పాల్‌సింగ్‌, గురుదీప్‌ సింగ్‌, సోనూ సింగ్‌, సాగర్‌దీప్‌ సింగ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇది కూడా చదవండి: ‘మహాకుంభ్‌’ ఖర్చెంత? లాభమెంత?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)