Breaking News

పశ్చాత్తాపంతో 40 ఏళ్ల తర్వాత లొంగిపోయిన కిల్లర్

Published on Wed, 06/03/2026 - 09:19

తిరువనంతపురం: నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన ఒక దారుణ హత్య ఉదంతం ఇప్పుడు హంతకుడి ఆత్మప్రబోధంతో బయటపడింది. కేరళలో 40 ఏళ్ల క్రితం జరిగిన హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చి, ఆ హత్యను తానే స్వయంగా చేశానని తెలియజేసి లొంగిపోయాడు.  
కోజికోడ్ జిల్లా కూడరంజికి చెందిన 55 ఏళ్ల మహమ్మద్ అలీ గత ఏడాది పోలీసులను ఆశ్రయించాడు. 1980ల కాలంలో తాను రెండు హత్యలు చేశానని, తనను అరెస్ట్ చేయాలని కోరాడు.

అవి తాను తెలియక చేసిన తప్పులని, ఇప్పుడు పశ్చాత్తాపంతో లొంగిపోతున్నానని మీడియాకు తెలిపాడు. కోర్టు విధించే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని ప్రకటించాడు. అయితే ఈ వింత కేసును ఛేదించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. మహమ్మద్ అలీ ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం.. 1986లో కూడరంజి వద్ద బాధితుడు తనపై లైంగిక దాడికి ప్రయత్నించగా, ఆత్మరక్షణ కోసం అతడిని నీటిలో ముంచి చంపేశానన్నాడు. ఈ క్లూ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించగా, డిసెంబర్ 1986లో ఒక పత్రికలో వచ్చిన వార్త కీలకమైంది. కూడరంజి మిషన్ హాస్పిటల్ వెనుక పొలాల్లో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైనట్లు ఆ వార్త సారాంశం.

తిరువంబడి పోలీసులు 1980ల కాలంలో మలబార్ ప్రాంతంలో నమోదైన మిస్సింగ్ కేసుల డేటాను పరిశీలించారు. సుదీర్ఘ శాస్త్రీయ విచారణ అనంతరం ఆ మృతుడు కన్నూర్ జిల్లా ఇరిట్టికి చెందిన మోహనన్‌గా గుర్తించారు. నిందితుడి వాంగ్మూలానికి, ఘటనా స్థలాలకు సరిగ్గా సరిపోలడంతో ఈ కేసును ధృవీకరించారు. కాగా, 1989లో కోజికోడ్ బీచ్‌లో చేసినట్లు చెబుతున్న మరో హత్యకు సంబంధించిన వివరాలను, బాధితుడి గుర్తింపును కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇది కూడా చదవండి: ‘నీట్’ టెన్షన్: ఆన్‌లైన్ ఎగ్జామ్ రాస్తూనే..

Videos

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు