Breaking News

తోటి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. వీడియో తీసి

Published on Sat, 07/09/2022 - 12:50

సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. పదోతరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికపై తోటి స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  విద్యార్థులతో సహా మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులంతా మైనర్లే కావడం గమనార్హం. వివరాలు.. కడలూరు జిల్లాకు చెందిన విద్యార్థి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గత నెల 22వ తేదీ ఆమెతో చదువుతున్న మరో విద్యార్థి పుట్టినరోజు కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

కేక్‌ కట్‌ చేసిన విద్యార్థి సమీపంలో సంబంధిత విద్యార్థిని నిలబడి ఉండగా ఆమె పక్కకు వచ్చిన విద్యార్థులు ముగ్గురు ఆ విద్యార్థినికి తెలియకుండా ఆమెతో సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసుకున్నారు.తర్వాత ముగ్గురు తరచూ ఆ ఫొటోను చూపెడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. పాఠశాల వెనకాల ఉన్న తన ఇంటికి రావాలని లేదంటే సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తామని బ్లాక్‌మెయిల్‌ చేశారు.

జూలై ఒకటో తేదీన విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో తీసిన వీడియోలు చూపెట్టి తిరిగి బెదిరింపులకు పాల్పడడంతో విషయాన్ని తల్లికి చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి ముగ్గురు విద్యార్థులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న విద్యార్థినిని అరెస్టు చేశారు. నలుగురిని కోర్టులో హాజరుపరచి కడలూరు జువైనల్‌ హోమ్‌కు తరలించారు.  
చదవండి: పెళ్లైన 15 ఏళ్లకు పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ.. యువకుల ‘మత్తు’కు బలి

లైంగిక దాడి కేసులో నిందితుల అరెస్ట్‌ 
మూడున్నరేళ్ల చిన్నారిపై లైంగికదాడి చేసిన కామాంధుడు, అందుకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈరోడ్‌కు చెందిన శ్రీనివాసన్‌ టీ దుకాణంలో మాస్టర్‌గా పని చేస్తున్నాడు. భార్య దివ్య (24). వీరికి కుమారుడు (7), మూడున్నర ఏళ్ల కుమార్తె ఉంది. దివ్య ఇటుకల బట్టిలో పనిచేస్తుంది. అక్కడ ఆమెకు జగన్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న శ్రీనివాసన్‌ భార్యను హెచ్చరించాడు. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ విడిపోయారు. దివ్య జగన్‌తో కలిసి ఉంటోంది.

ఈ క్రమంలో గత 30వ తేదీ జగన్‌ బాలికపై లైంగిక దాడి చేశాడు. స్పృహ తప్పిన బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న విరాలిమలై పోలీసులు కేసు నమోదు చేసి చిన్నారి మృత దేహాన్ని శవ పరీక్ష కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లైంగిక దాడి చేసిన జగన్, అతని స్నేహతుడు పలని యప్పన్‌ను, చిన్నారి తల్లి దివ్యను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.   

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)