Breaking News

37 కిలోలు, రూ.75 కోట్లు!

Published on Mon, 03/17/2025 - 04:59

న్యూఢిల్లీ/బనశంకరి: కర్నాటక పోలీసులు 37 కిలోల ఎండీఎంఏ (మెథిలీన్‌ డయాక్సీ మెథాంఫెటమైన్‌) అనే సింథటిక్‌ డ్రగ్‌ను పట్టుకున్నారు. దీని విలువ రూ.75 కోట్లని మంగళూరు పోలీస్‌ కమిషనర్‌ అనుపమ్‌ అగర్వాల్‌ ఆదివారం మీడియాకు తెలిపారు. గత సెప్టెంబరులో మంగళూరులో హైదర్‌ అలీ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేసి 15 గ్రాముల ఎండీఎంఏ స్వాదీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో బెంగళూరులో ఓ నైజీరియా దేశస్తున్ని పట్టుకోగా రూ.6 కోట్ల విలువైన ఎండీఎంఏ దొరికింది.

ఇది అంతర్జాతీయ డ్రగ్స్‌ దందా అని, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల ద్వారా అక్రమ రవాణా జరుగుతోందని గుర్తించారు. మంగళూరు పోలీసులు బాంబా ఫాంట్‌ (31), అబిగైల్‌ అడోనిస్‌(30) అనే దక్షిణాఫ్రికన్లను అరెస్ట్‌ చేసి ట్రాలీ బ్యాగుల్లో దాచిన 37 కిలోల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. ఎండీఎంఏను మోల్లీ, ఎక్‌స్టసీ అని పలు పేర్లతో పిలుస్తారు. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఇంఫాల్, గౌహతి జోన్లలో రూ.88 కోట్ల విలువైన మెథాంఫెటమైన్‌ డ్రగ్‌ టాబ్లెట్లను పట్టుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు.

ఇందుకు సంబంధించి అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా సభ్యులైన నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారని ఆదివారం ‘ఎక్స్‌’లో వెల్లడించారు. ‘‘ఎన్‌సీబీ ఇంఫాల్‌ జోన్‌ అధికారులు ఈ నెల 13న లిలాంగ్‌ ప్రాంతంలో ఓ ట్రక్కులో సోదాలు జరిపి టూల్‌బాక్స్‌లో దాచిన 102.39 కిలోల మెథాంఫెటమైన్‌ ట్యాబ్లెట్లను పట్టుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అసోం సరిహద్దుల్లో ఓ వాహనం స్పేర్‌ టైర్‌లో దాచిన 7.48 కిలోల మెథాంఫెటమైన్‌ టాబ్లెట్లను పట్టుకున్నారు’’ అని తెలిపారు.

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)