బంగారాన్నే నమ్ముతా: జోహో సీఈఓ శ్రీధర్ వెంబు

Published on Sun, 10/12/2025 - 16:18

బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి. అదే సమయంలో క్రిప్టో కరెన్సీకి కూడా క్రేజ్‌ పెరుగుతోంది. అయితే స్వదేశీ సాంకేతిక ఆవిష్కరణలతో వార్తల్లో నిలుస్తున్న జోహో (Zoho)వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీధర్ వెంబు.. తాను బంగారాన్నే(Gold) నమ్ముతా అంటున్నారు.

క్రిప్టో క్రేజ్ లేదా తాజా మార్కెట్ ట్రెండ్‌లకు లోనుకాకుండా బంగారాన్ని సంపదకు విశ్వసనీయమైన నిల్వగా కొనసాగిస్తున్నారు. కరెన్సీ క్షీణతకు రక్షణగా బంగారాన్ని భావించే శిబిరంలో 25 సంవత్సరాలుగా కొనసాగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఈమేరకు శ్రీధర్‌ వెంబు (Sridhar Vembu) ‘ఎక్స్‌’(ట్విటర్‌)లో ఓ పోప్ట్‌ పెట్టారు. తనకు క్రిప్టోకరెన్సీలపై ఆసక్తి లేదని, బంగారాన్ని స్థిరమైన, కాలాతీత పెట్టుబడిగా చూస్తానని పేర్కొన్నారు. లిన్ ఆల్డెన్ అనే స్థూల ఆర్థిక వ్యూహకర్త చేసిన విశ్లేషణలో కూడా ఇదే భావనను సమర్థిస్తుందని ప్రస్తావించారు. ఆమె పరిశోధన ప్రకారం, అమెరికా ట్రెజరీ బాండ్లు, స్టాక్స్,రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు ద్రవ్యోల్బణాన్ని అనుసరించే బంగారాన్ని దీర్ఘకాలంలో అధిగమించలేకపోయాయి.

ఆల్డెన్ చెప్పినట్లు, కేవలం 4 శాతం స్టాకులే మార్కెట్ రాబడికి ముఖ్య కారణమవుతాయి. రియల్ ఎస్టేట్ కూడా పన్నులు, నిర్వహణ ఖర్చులు, ద్రవ్యోల్బణం వంటి అంశాల వల్ల బంగారంతో పోలిస్తే తక్కువ పనితీరు చూపించింది.

ఇదిలా ఉండగా, 2025లో ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాలు, అమెరికా-చైనా ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు వంటివి బంగారం ధరలు ఔన్స్‌కు 4,000 డాలర్లు (రూ. 3.57 లక్షలు) దాటేలా చేశాయి. ఈ పరిణామాలు వెంబు నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నాయి.

ఇదీ చదవండి: ఆ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫార్ములా చచ్చింది.. కొత్తది వచ్చింది: రాబర్ట్‌ కియోసాకి

శ్రీధర్‌ వెంబు లాజిక్‌ స్పష్టంగా ఉంది. బంగారం తక్షణ లాభాల కోసం కాదు, ఇది దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం. “బంగారం ఓర్పునకు సంబంధించినది” అని చెబుతూ, ఆధునిక హైప్‌తో నిండిన పెట్టుబడి ప్రపంచంలో ఆయన దృఢమైన వైఖరి విశిష్టంగా నిలుస్తోంది.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)