Breaking News

వైబ్ కోడింగ్‌.. ‘ఏఐకి అంత సీన్‌ లేదు’

Published on Tue, 12/02/2025 - 11:27

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ‘వైబ్ కోడింగ్’పై టెక్‌ దిగ్గజాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నేచురల్‌ లాంగ్వేజీలో ఆదేశాలు ఇస్తూ ఏఐ ద్వారా కోడ్‌ను రాయించుకునే ఈ విధానంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అనుకూలంగా స్పందిస్తుంటే, టెక్ టైకూన్ జోహో సీఈఓ శ్రీధర్ వెంబు అంతగా దీన్ని సపోర్ట్‌ చేయడం లేదు. అందుకు వారు చెబుతున్న కారణాలు విభిన్నంగా ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.

వైబ్ కోడింగ్ అంటే ఏమిటి?

వైబ్ కోడింగ్ అనేది సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ (Software Development)లో కొత్తగా వాడుకలోకి వచ్చిన ఒక విధానం. ఇందులో సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని వ్యక్తులు కూడా తమ ప్రాజెక్ట్ లక్ష్యాలను సాధారణ, రోజువారీ భాషలో(Natural Language Prompts) ఏఐ ఆధారిత టూల్స్‌కు (ఉదాహరణకు, Google's AI Studio, OpenAI Codex) కమాండ్‌ ఇస్తారు. ఏఐ ఆ ఆదేశాలను అర్థం చేసుకొని దానికి సంబంధించిన ఫంక్షనల్ కోడ్‌ను జనరేట్ చేస్తుంది. కోడింగ్ పరిజ్ఞానం లేనివారు కూడా యాప్‌లు, వెబ్‌సైట్‌లు లేదా ప్రోటోటైప్‌లను సులభంగా తయారు చేయవచ్చు.

సుందర్ పిచాయ్..

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వైబ్ కోడింగ్‌ను సానుకూలంగా చూస్తున్నారు. టెక్నికల్ పరిజ్ఞానం లేని వ్యక్తులు కూడా తమ ఆలోచనలను ప్రోటోటైప్‌లుగా మార్చవచ్చని చెబుతున్నారు. గతంలో ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఆలోచన గురించి మాటల్లో వివరించేవారు. ఇప్పుడు, వైబ్ కోడింగ్ ద్వారా ఆ ఆలోచనకు కోడెడ్ వెర్షన్ లేదా ప్రోటోటైప్‌ను జనరేట్‌ చేసే వీలుందన్నారు.

శ్రీధర్ వెంబు..

జోహో సీఈఓ శ్రీధర్ వెంబు వైబ్ కోడింగ్ పట్ల అంతగా సానుకూలంగా లేరు. ఏఐ జనరేట్‌ చేసే కోడ్ మనకు అద్భుతంగా అనిపించినప్పటికీ, కంప్యూటర్ ఎలా పనిచేస్తుందనే క్లిష్టమైన, లోతైన అవగాహన అవసరమన్నారు. ఏఐ సాధారణంగా రీయూజబుల్‌ కోడ్‌ను రాయడంలో సహాయపడుతుందన్నారు. కానీ, కోర్ లాజిక్, కొత్త సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలు ఏఐకి ఉండవని చెప్పారు. ఇవి మానవ సృజనాత్మకత, అనుభవంపై ఆధారపడి ఉంటాయని వెంబు నమ్ముతున్నారు. కోడింగ్‌ అనేది ఓ మ్యాజిక్‌ అన్నారు. 

వైరుధ్యంలో ఏకాభిప్రాయం

ఈ రెండు దృక్పథాల మధ్య పిచాయ్ కూడా ఓ పోడ్‌కాస్ట్‌లో వైబ్ కోడింగ్ పరిమితులను అంగీకరించారు. కొన్ని రకాల లార్జ్‌, సెక్యూరిటీ సిస్టమ్స్‌కు వైబ్ కోడింగ్ సరిపోదన్నారు. అందుకు అనుభవం కలిగిన ఇంజినీర్లు అవసరమని చెప్పారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)