Breaking News

30ల్లోనే ముచ్చెమటలు.. తీవ్ర వ్యాధులు

Published on Sat, 06/07/2025 - 09:12

యువత చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం సంపాదించాలనే ధోరణి మంచిదే. అయితే కొలువు సంపాదించాకా కార్పొరేట్‌ వాతావరణానికి అలవాటుపడలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ వయసులోనే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలు, అధిక రక్తపోటు, మధుమేహం, మహిళల్లో పీరియడ్లకు సంబంధించిన పీసీఓఎస్‌ వంటి  దీర్ఘకాలిక వ్యాధుల సమస్యలను ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు. ఇలా చెబుతున్నవారి సగటు వయసు 40 కంటే తక్కవే కావడం ఆందోళన కలిగిస్తుంది.

సమస్యలు షురూ..

దీర్ఘకాలిక వ్యాధుల ప్రారంభ వయసు బాగా తగ్గిపోతోంది. హృద్రోగ నిపుణులను సంప్రదించేవారి సగటు వయసు ఇప్పుడు కేవలం 35 మాత్రమేనని కొన్ని సంస్థలు చెబుతున్నాయి. ఒక్క గుండె జబ్బులకే ఇది పరిమితం కాలేదు.. తీవ్రమైన ఇతర సమస్యలూ చిన్న వయసులోనే ఎదురవుతున్నాయి. తీసుకునే ఆహారం విషయంలో నిర్లక్ష్యం, సమయపాలన లేని ఆహారపుటలవాట్లు, గంటల తరబడి సీట్లకే పరిమితం కావడం, సరైన శారీరక శ్రమ లేకపోవడం, పని ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

వ్యయ భారం ఇలా..

కుటుంబంలోని ప్రధాన సంపాదనపరుల్లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చిన్న వయసులో రావడం ఆయా కుటుంబ సభ్యులను ఆందోళకు గురిచేస్తోంది. ఇది దేశ ఉత్పాదకత, ఆర్థిక వృద్ధి, ఆరోగ్య సంరక్షణ ఖర్చులపై తీవ్ర ప్రభావాలను చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా కంపెనీలు ఏడాదికి ఒక ఉద్యోగి నుంచి 30 రోజుల వరకు ఉత్పాదకత, పని దినాలను కోల్పోతాయని అంచనా వేస్తున్నారు. 40 శాతం ఉద్యోగులు మానసిక అనారోగ్య సమస్యలతో నెలలో కనీసం ఒక రోజైనా సెలవు తీసుకుంటున్నారని అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: జస్ట్‌ పరారీలో ఉన్నాను.. దొంగను కాదు: విజయ్‌ మాల్యా

ఏం చేయాలంటే..

కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమం కోసం క్రమం తప్పకుండా ఆరోగ్య తనిఖీలను చేపడుతున్నాయి. కానీ ఇలాంటి కార్యక్రమాల్లో కొద్దిమంది ఉద్యోగులే పాల్గొంటున్నారు. చాలా కొద్ది కంపెనీలే ఉద్యోగుల ఆరోగ్యానికి అనుగుణంగా మెరుగైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. కార్పొరేట్‌ వ్యవస్థ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రస్తుత పని ప్రణాళిల్లో మార్పులు చేయాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల కూడా తమ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించడంతోపాటు ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకోవాలని చెబుతున్నారు. ఉద్యోగం ఉన్నన్ని రోజులు కంపెనీ అందించే బీమా ఉపయోగపడొచ్చు. అనుకోని కారణాల వల్ల ఉద్యోగం కోల్పోతే పరిస్థితి దిగజారుతుంది. కాబట్టి ప్రత్యేకంగా ఆరోగ్య బీమా ఉండడం ఉత్తమం. సంపాదన మొదలు పెట్టిన వెంటనే ఆర్థిక నిపుణులు సలహాతో మంచి ఆరోగ్య బీమాను ఎంచుకోవాలి.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)