Breaking News

వైరల్‌ అవుతున్న లలిత్‌ మోడీ ఆస్తుల విలువ.. ఎన్ని వేల కోట్లంటే?

Published on Wed, 04/26/2023 - 13:53

ఐపీఎల్‌! వేల కోట్లలో లావాదేవీలు. పరుగు చేస్తే  నోటు, బౌండరీ పడితే కట్ట..గెలిస్తే కోటితో వ్యవహారం అది..! కానీ ఓడినా కోట్లు, నోట్లు వస్తాయండోయ్ అదే ఐపీఎల్‌లో మజా. ఇటువంటి మజాను అందించేలా కార్పొరేట్‌ క్రికెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనుడే ఈ లలిత్‌ మోడీ! 

కానీ ఐపీఎల్‌ను తన సొంత అవసరాలకు వాడుకొని అప్రతిష్టను మూటగట్టుకున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. చివరికి పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌లో కేసులో దేశం విడిచి పారిపోయిన లలిత్‌ మోడీ 2010 నుంచి లండన్‌లో ఉంటున్నారు.

ఎప్పుడూ వివాదాలు, కొత్త సంచలనాలను వెంట పెట్టుకొని తిరిగే లలిత్‌ మోడీకి ఆయన తల్లి బీనా మోడీ, ఇతర కుటుంబసభ్యులకు మధ్య ఆస్తి వివాదం కొనసాగుతోంది. ఈ వివాదంలో బీనా మోడీ తరుపు వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీపై నోరు జారారు. సుప్రీం కోర్ట్‌ చివాట్లు పెట్టడంతో వెనక్కి తగ్గారు. ఈ తరుణంలో లలిత్‌ మోడీ ఎక్కడ ఉంటున్నారు? బిజినెస్‌లు ఏమైనా చేస్తున్నారా? చేస్తుంటే ఆయనకి ఎంత ఆస్తి ఉంది? అని నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు. (ఓర్నీ వయ్యారం..ఇదేమి ట్రైన్‌ భయ్యా! ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న వీడియో)

ఐపీఎల్‌ కుంభకోణం వెలుగులోకి రావడంతో లలిత్‌ మోడీని బీసీసీఐ నిషేధించింది. కేసులు, విచారణనుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయినా అక్కడ కూడా దర్జాగా బతికేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మీడియా ఎప్పుడు ఆయనను పలికరించినా నేను గోల్డెన్‌ స్పూన్‌తో పుట్టానని చెప్పుకునే లలిత్‌.. క్రికెట్‌ను వదిలేసినా ఇతర వ్యాపార వ్యవహారాల్ని చక్క బెట్టుకుంటున్నారు. (ముంబై ఇండియన్స్‌ బాస్‌ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన)
 

లలిత్ మోడీ తన కెరీర్‌లో భారీ ఆస్తులే కూడబెట్టారు. పరారీలో ఉన్నప్పటికీ తన తండ్రికి చెందిన మోడీ ఎంటర్‌ప్రైజెస్‌కు అధిపతిగా కొనసాగుతున్నారు. సిగరెట్ తయారీ, విద్య, వ్యవసాయం,ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇలా అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న మోడీ ఎంటర్‌ప్రైజెస్‌కు అధ్యక్షుడు కూడా. పలు నివేదికల ప్రకారం, 2021లో మోడీ కంపెనీ టర్నోవర్ రూ.1750 కోట్లు. నెలవారీ ఆదాయం దాదాపు రూ.16.5 కోట్లు కాగా, ఆయన వ్యక్తిగత ఆస్తులలో లండన్‌లో 5 అంతస్తుల విలాసవంతమైన ఇల్లు, రూ.12,000 కోట్ల భారీ వ్యాపారం, అనేక  లగ్జరీ కార్లు ఉన్నాయని సమాచారం. 2023 నాటికి, భారత్‌లో అతని నికర ఆస్తుల విలువ రూ. 4555 కోట్లకు పైగా ఉందని సమాచారం.

చదవండి👉 ‘మమ్మల్ని ఆదుకోండి సార్‌’.. రతన్‌ టాటాకు చేరిన పైలెట్ల పంచాయితీ!

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)