Breaking News

కంటైనర్లను వెనక్కి తీసుకుంటున్న ఎగుమతిదారులు

Published on Fri, 03/06/2026 - 11:30

పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదరడంతో భారత వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదం కారణంగా సముద్ర మార్గాలు మూసుకుపోవడంతో భారతీయ ఓడరేవుల్లో సుమారు 38,000 కంటైనర్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అటు సరుకు పంపలేక, ఇటు పోర్టుల్లో ఉంచితే పెరిగే భారీ అద్దెలను భరించలేక ఎగుమతిదారులు ఇప్పుడు తమ కంటైనర్లను వెనక్కి తీసుకుంటున్నారు.

సగానికి పైగా కంటైనర్లు వెనక్కి!

తాజా అధికారిక సమాచారం ప్రకారం, నిలిచిపోయిన కంటైనర్లలో దాదాపు 50 శాతం అంటే సుమారు 19,000 కంటైనర్లను ఎగుమతిదారులు వెనక్కి రప్పించుకుంటున్నారు. దీనికోసం కస్టమ్స్ శాఖకు ‘బ్యాక్ టు టౌన్’ దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా త్వరగా పాడైపోయే పండ్లు, కూరగాయలు, ఔషధాల విషయంలో ఎగుమతిదారులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు.

వీటిని ఏం చేస్తారు?

విదేశాలకు వెళ్లాల్సిన ఉల్లి, అరటి, ద్రాక్ష, బాస్మతీ బియ్యం ఇప్పుడు భారతీయ మార్కెట్లలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల దేశీయంగా వీటి ధరలు కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ఎగుమతిదారులకు మాత్రం ప్యాకేజింగ్, రవాణా ఖర్చుల రూపంలో నష్టం తప్పదనే అభిప్రాయాలున్నాయి. పోర్టుల్లో కంటైనర్ నిలిచి ఉంటే నిర్వహణ ఖర్చులు భరించాల్సి ఉంటుంది. షిప్పింగ్ లైన్లు కూడా 2,000 డాలర్ల వరకు అదనపు సర్‌ఛార్జీలు విధిస్తుండటంతో ఎగుమతి లాభదాయకం కాదని వ్యాపారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కింద తెలియజేశాం.

ఇదీ చదవండి: ప్రకటనల రంగంలో ఏఐ విప్లవం

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)