Breaking News

అమెరికా స్థాయిలో దేశంలో రోడ్డు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం!: గడ్కరీ

Published on Sun, 02/12/2023 - 19:16

ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో 2024 చివరి నాటికి దేశంలోని రోడ్డు మౌలిక సదుపాయాలను అమెరికా స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. రాజస్థాన్‌లోని దౌసాలో హైవే మొదటి దశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చేలా కొత్త ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మించినట్లు తెలిపారు. 

స్వావ‌లంబన తోకూడిన భార‌త‌దేశంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. 2024 చివరి నాటికి మోదీ సారధ్యంలో అమెరికాతో సమానంగా దేశ రహదారి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాము’అని కేంద్ర మంత్రి చెప్పారు.

సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రధాని మోదీ కల అని అన్నారు. పైన పేర్కొన్నట్లుగా మూడు రంగాల్లో వెనుకబడిన 500 బ్లాకులను గుర్తించినట్లు చెప్పిన గడ్కరీ..ఈ రహదారి మార్గం వెనుకబడిన ప్రాంతాల గుండా వెళుతోందని.. తద్వారా ఈ ఏరియాలకు హైవే ఒక గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ నడిచేందుకు వీలుగా  జైపూర్ - ఢిల్లీ మధ్య ఎలక్ట్రిక్ కేబుల్ నిర్మాణాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.   

కాగా,ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్‌వే తొలిదశలో భాగంగా ఢిల్లీ - దౌసా- లాల్‌సోట్‌ల మధ్య నిర్మించిన రహదారిని ఆదివారం ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. 247 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును రూ.10,400 కోట్ల ఖర్చుతో నిర్మించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)