Breaking News

భయంతోనే బంగారం కొంటున్నారా?

Published on Sat, 08/09/2025 - 18:44

పెట్టుబడుల ప్రపంచంలో వారెన్ బఫెట్ అగ్రస్థానంలో ఉన్నారు. అధిక రాబడులనిచ్చే స్టాక్స్‌ ఎంచుకునే చాతుర్యానికి పేరుగాంచిన బఫెట్ స్టాక్ మార్కెట్లో తిరుగులేని రారాజు. మరి ఆయన సంపద ఎంతనుకుంటున్నారు..? 140 బిలియన్‌ డాలర్లు. అంటే దాదాపు రూ.12 లక్షల కోట్లు. ఇంత భారీ సంపద ఉన్నా ఆయన దగ్గర రవ్వంత బంగారం కూడా లేదంటే నమ్ముతారా?

బంగారంపై ఇన్వెస్ట్ చేసే విషయానికి వస్తే వారెన్ బఫెట్ చాలా క్లియర్ గా ఉంటాడు. ఆయనకు బంగారంపై ఎటువంటి పెట్టుబడులు లేవు. బంగారం వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టకూడదనేది వారెన్ బఫెట్ గోల్డెన్ రూల్. తన వాల్యూ ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజీకి బంగారం సరిపోదని కొన్నేళ్లుగా ఆయన చెబుతూ వస్తున్నారు. బఫెట్‌కు ఏకైక బంగారు పెట్టుబడి బారిక్ గోల్డ్ అనే గోల్డ్‌ మైనింగ్ కంపెనీలో ఉండేది. అది కూడా ఆయన అంతర్గత మనీ మేనేజర్లలో ఎవరైనా స్వతంత్రంగా పెట్టి ఉండవచ్చు. దాన్ని తర్వాత ఆరు నెలలోనే బఫెట్ విరిమించుకున్నారు.

బఫెట్ దగ్గర బంగారం ఎందుకు లేదంటే..?
బఫెట్ బంగారాన్ని ఉత్పాదకత లేని ఆస్తిగా భావిస్తారు. ‘బంగారంలో రెండు ముఖ్యమైన లోపాలు ఉన్నాయి. అది పెద్దగా ఉపయోగం లేనిది అలాగే ఉత్పాదకత లేనిది’ అని 2011లో వారెన్ తన షేర్ హోల్డర్లతో అన్నారు. బంగారానికి కొంత పారిశ్రామిక ఉపయోగం, ఆభరణాలుగా పనికొస్తుంది కానీ అంతకు మించి ఇంకేం లేదు. ఇది తప్పుడు పెట్టుబడి అనేది ఆయన అభిప్రాయం.

2011లో బఫెట్‌ ఈ వైఖరి తీసుకున్నప్పుడు 1,750 డాలర్లుగా ఉన్న ఔన్స్‌ బంగారం ప్రస్తుతం 3,350 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంటే పద్నాలుగేళ్లలో బంగారం ధర రెట్టింపు అయింది. దీన్ని బట్టి బఫెట్‌ అభిప్రాయం తప్పని చాలా మందికి అనిపిస్తుంది. కానీ కాంపౌండ్ యాన్యువలైజ్డ్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) పరంగా చూస్తే ఇది కేవలం 5 శాతం మాత్రమే. ఇదే సమయంలో యూఎస్ స్టాక్స్ 14 శాతానికి పైగా సీఏజీఆర్ పెరిగాయి. కాబట్టి బంగారం విషయంలో బఫెట్ అభిప్రాయం కరెక్టే..

బంగారం ధర పెరగడానికి భయమే కారణం
పెట్టుబడిదారులకు వారెన్ బఫెట్ చెప్పే ప్రసిద్ధమైన మాట ఏమిటంటే ‘ఇతరులు అత్యాశతో ఉన్నప్పుడు భయపడాలి.. ఇతరులు భయంతో ఉన్నప్పుడు ఆశ పడాలి’. బంగారం విషయంలో ఇదే వర్తిస్తుందంటాయన. బంగారం ధర పెరగడానికి భయమే కారణమనేది  ఆయన అభిప్రాయం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)