వికసిత్‌ భారత్ లక్ష్యంగా ‘కర్తవ్య మంత్రం’: నిర్మలా సీతారామన్‌

Published on Sun, 02/01/2026 - 11:25

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ దేశాభివృద్ధికి సంబంధించి కీలకమైన రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు. కర్తవ్య భవన్‌లో రూపొందించిన తొలి బడ్జెట్‌గా దీన్ని అభివర్ణిస్తూ యువతను కీలకంగా చేసుకొని భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ‘మూడు కర్తవ్యాలు’, ‘ఆరు దశల ప్రక్రియ’ను ఆమె ప్రకటించారు.

మూడు ప్రధాన కర్తవ్యాలు

ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చడానికి మూడు ముఖ్యమైన విధులను (కర్తవ్యాలను) ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.

1. ఆర్థిక వృద్ధి: అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలకు అనుగుణంగా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం. ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచడం ద్వారా ప్రపంచ సవాళ్లను తట్టుకోగల సామర్థ్యాన్ని నిర్మించడం.

2. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం. వారిని కేవలం లబ్ధిదారులుగా కాకుండా భారతదేశ శ్రేయస్సులో బలమైన భాగస్వాములుగా మార్చేలా వారి నైపుణ్యాలను పెంపొందించడం.

3. సమ్మిళిత వనరుల పంపిణీ: ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ విజన్‌తో ప్రతి కుటుంబం, సమాజం, ప్రాంతానికి వనరులు అందేలా చూడటం.

‘నీరు, ఎనర్జీ, క్లిష్టమైన ఖనిజాల అవసరం పెరుగుతోంది. కొత్త సాంకేతికతలు ఉత్పత్తి వ్యవస్థలను మారుస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఆశయాన్ని, సమ్మిళిత వృద్ధిని సమతుల్యం చేస్తూ భారతదేశం వికసిత్‌ భారత్ వైపు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తుంది’ అని నిర్మలా సీతారామన్ అన్నారు.

ఆరు దశల ప్రక్రియ

భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు బడ్జెట్‌లో ఆరు కీలక అంశాలపై దృష్టి సారించినట్లు కేంద్రమంత్రి చెప్పారు.

వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి: ఉత్పాదకత పెంపుదల.

యువశక్తి, ఉపాధి: యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన.

మౌలిక సదుపాయాల కల్పన: ఆధునిక రవాణా, డిజిటల్ మౌలిక వసతులు.

సుస్థిర ఇంధనం: ఇంధన భద్రత, క్లీన్ ఎనర్జీ.

ఇన్నోవేషన్‌, పరిశోధన: టెక్నాలజీ రంగంలో స్వయం సమృద్ధి.

సమ్మిళిత అభివృద్ధి: అణగారిన వర్గాలు, పేదల సాధికారత.

 

 

ఇదీ చదవండి: Budget 2026: కేంద్ర బడ్జెట్‌కు వేళాయె..

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)