Breaking News

అమెరికా సుంకాలు.. రిస్క్‌లో 3 లక్షల ఉద్యోగాలు!

Published on Tue, 08/19/2025 - 16:42

భారత ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాలు వివిధ రంగాలలో ఆందోళనలను రేకెత్తించాయి. ఆంక్షల కారణంగా సుమారు 3,00,000 ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణుల అంచనా.

అమెరికా విధించిన సుంకాల ప్రభావం చాలా వరకు వస్త్ర పరిశ్రమ, రత్నాల పరిశ్రమలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ రంగాల్లో పనిచేస్తున్న లక్షలమంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. అయితే.. ఎగుమతులు తగ్గినప్పటికీ.. దేశంలో డిమాండ్ ఉంటుందని, అమెరికా సుంకాలు భారత ఆర్ధిక వ్యవస్థ మీద పెద్దగా ప్రభావం చూపవని మరికొందరు చెబుతున్నారు.

వస్త్ర, రత్నాల రంగాలను పక్కన పెడితే.. ఐటీ సర్వీస్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ) కూడా అమెరికా సుంకాల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. ఆటో విడిభాల సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు కూడా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని జీనియస్ హెచ్‌ఆర్‌టెక్ వ్యవస్థాపకులు & సీఎండీ ఆర్‌పీ యాదవ్ అన్నారు.

భారతదేశం వస్త్రాలను, రత్నాభరణాలను ఎక్కువగా అమెరికాకు ఎగుమతి చేస్తోంది. అయితే టారీఫ్స్ పెరగడం వల్ల ఇప్పుడు ఇది ప్రశ్నార్థకంగా మారింది. సుంకాలు పెరగడం వల్ల.. ధరలు పెరుగుతాయి. దీనివల్ల మార్కెట్‌లో అమ్మకాలు గణనీయంగా తగ్గుతాయి. అయితే మన దేశం ప్రత్యామ్నాయంగా వేరే దేశాలకు ఎగుమతి చేసుకోవడం ద్వారా.. నష్టాన్ని ఆపవచ్చు.

ఇదీ చదవండి: బంగారం, వెండి & బిట్‌కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?

అమెరికాకు భారతదేశం ఎగుమతులు 87 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇది జీడీపీలో కేవలం 2.2 శాతం మాత్రమే. ఫార్మా, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక పరిశ్రమలు ప్రస్తుతానికి ప్రభావితం కాలేదు. భారత్ తన ఎగుమతులను ఇతర దేశాలకు మళ్లించగలదని టీమ్‌లీజ్ సర్వీసెస్‌లో ఎస్వీపీ బాలసుబ్రమణియన్ అనంత నారాయణన్ పేర్కొన్నారు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు