Breaking News

అమెరికా అణ్వాయుధ సిబ్బందికి లేఆఫ్స్‌

Published on Sat, 10/18/2025 - 08:46

యూఎస్‌ ఫెడరల్ ప్రభుత్వం షట్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అణ్వాయుధాల రూపకల్పన, వాటి నిర్వహణ, వాటిని భద్రపరచడానికి బాధ్యత వహించే కీలక ఏజెన్సీ అయిన నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (NNSA) సిబ్బందికి సామూహిక లేఆఫ్స్‌ తప్పవని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్వహణకు నిధులు లేకపోవడంతో ఏజెన్సీ తన ఉద్యోగుల్లో అధికశాతం మందిని తాత్కాలికంగా తొలగించవలసి వస్తుంది. దీంతో అమెరికా జాతీయ భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

80 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్స్‌

హౌస్ ఆర్మ్‌డ్‌ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్, రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు మైక్ రోజర్స్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ..‘NNSA వద్ద ఉన్న నిధులు త్వరలో అయిపోనున్నాయనే సమాచారం ఉంది. దీని కారణంగా ఏజెన్సీలోని ఉద్యోగుల్లో 80 శాతం మందిని తొలగించాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు. యూఎస్‌ ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్‌ఎన్‌ఎస్‌ఏపై షట్ డౌన్ ప్రభావాల గురించి మాట్లాడుతూ..‘త్వరలో ఏజెన్సీలో పని చేస్తున్న సుమారు పదివేల మందికి లేఆఫ్స్‌ ఇస్తాం. మా జాతీయ భద్రతకు వారు కీలకమైన సిబ్బంది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఈ చర్యలు తప్పడం లేదు’ అని తెలిపారు.

జాతీయ భద్రతపై ఆందోళన?

‘ఏజెన్సీలో చాలామంది ఉద్యోగులు దేశానికి సంబంధించిన ముఖ్యమైన వ్యూహాత్మక ఆస్తిని నిర్వహిస్తున్నారు. అందులో భద్రత, అత్యవసర సిబ్బంది విధుల్లో ఉంటారు. మేము ఇప్పటికే ఉన్న ఆయుధాగారాన్ని చెక్కుచెదరకుండా, సురక్షితంగా ఉంచబోతున్నాం. జాతీయ భద్రతపై ఎలాంటి ఆందోళన వద్దు’ అని రైట్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ధన త్రయోదశి రోజున బంగారంపై పెట్టుబడా?

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)