Breaking News

చైనాకు చెక్‌ పెట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా డీల్‌

Published on Wed, 10/22/2025 - 16:32

స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రిక్‌ వాహనాలు మొదలు రక్షణ, అంతరిక్ష రంగంలో కీలక ఉపకరణాల దాకా అన్నింటి తయారీకి అత్యావశ్యకమైన ఖనిజాల సరఫరాపై చైనా గుత్తాధిపత్యానికి గండి కొట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా చేతులు కలిపాయి. విదేశాలకు తమ అరుదైన ఖనిజాలను ఎగుమతి చేయాలంటే కఠిన నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందేనని చైనా మొండికేయడం తెల్సిందే.

దీంతో చైనాకు చెక్‌ పెట్టడమే లక్ష్యంగా అమెరికా, ఆస్ట్రేలియా రూ.75,000 కోట్ల విలువైన చరిత్రాత్మకమైన ‘అరుదైన ఖనిజాల ఒప్పందం’కుదుర్చుకున్నాయి. అధ్యక్షభవనంలో డొనాల్డ్‌ ట్రంప్, ఆ్రస్టేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌ ఈ కీలక ఒప్పందంపై సంతకాలు చేశారు. తర్వాత మీడియాతో ట్రంప్‌ మాట్లాడారు.

‘‘గత కొన్ని నెలలుగా చర్చలు జరిపి ఎట్టకేలకు నేడు ఒప్పందం కుదుర్చుకున్నాం. మరో ఏడాదిలోగా మా రెండు దేశా లు భారీ ఎత్తున అరుదైన ఖనిజ నిల్వలను సాధించనున్నాయి. ఈ నిల్వలతో మేమేం చేస్తామో మీకు కూడా తెలీదు’’అని వ్యాఖ్యానించారు.

తొలి ఆరు నెలల్లో ఇరు దేశాలు చెరో 3 బిలియన్‌ డాలర్ల మేర ఖనిజాల తవ్వకాల ప్రాజెక్ట్‌ల్లో పెట్టుబడులు పెడతాయి.  ఉపగ్రహాలు, ఎంఆర్‌ఐ యంత్రాలు, గైడెన్స్‌ వ్యవస్థలు, లేజర్లు, జెట్‌ ఇంజిన్లదాకా అన్నింటి తయారీలోనూ అరుదైన భూ మూలకాలనే ఉపయోగిస్తారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)