Breaking News

కొత్త కస్టమర్లను తీసుకోవద్దు: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుపై ఆంక్షలు

Published on Sat, 09/27/2025 - 20:31

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు.. దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (DFSA) షాకిచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC) బ్రాంచ్.. కొత్త కస్టమర్లను చేర్చుకోవడపై నిషేధం విధించింది.

దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాలు సెప్టెంబర్ 26 నుంచి అమలులోకి వచ్చాయి. తరువాత నోటీసులు అందేవరకు ఈ ఆర్డర్ అమలులోనే ఉంటుంది. కాబట్టి అప్పటివరకు కొత్త ఆర్ధిక ఉత్పత్తులకు సంబంధించిన సలహాలు ఇవ్వడం, ఇన్వెస్ట్‌మెంట్ డీల్స్, క్రెడిట్ సంబంధిత సలహాలు ఇవ్వడం, కస్టడీ సర్వీస్ వంటి పలు ఆర్థిక సేవలను నిలిపివేయాలి. అంతే కాకుండా కొత్త ఆర్ధిక ప్రచారాల్లో కూడా బ్యాంక్ పాల్గొనకూడదు. అయితే ఇప్పటికే ఉన్న బ్యాంక్ కస్టమర్లు.. తమ సేవలను యధావిధిగా పొందవచ్చు.

దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాలు పాటించడానికి బ్యాంక్ సిద్దమైంది. అంతే కాకుండా ఈ సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించుకోవడానికి.. డీఎఫ్ఎస్ఏతో కలిసి పనిచేయడానికి తాము కట్టుబడి ఉన్నామని హెచ్‌డీఎఫ్‌సీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఇదీ చదవండి: అక్టోబర్‌లో బ్యాంక్ హాలిడేస్: ఇదిగో జాబితా..

సెప్టెంబర్ 23 నాటికి, దాని డీఐఎఫ్సీ బ్రాంచ్‌లో జాయింట్ హోల్డర్లతో సహా 1,489 మంది కస్టమర్లు ఉన్నారని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. అయితే దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ ఇచ్చిన ఆర్డర్.. బ్యాంకు మొత్తం కార్యకలాపాలు లేదా ఆర్థిక స్థితిపై అటువంటి ప్రభావం చూపదని హెచ్‌డీఎఫ్‌సీ వెల్లడించింది. అంతే కాకుండా బ్రాంచ్ కస్టమర్ల నిరంతర సేవలకు ఈ నిషేధం వర్తించదని స్పష్టం చేసింది.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)