Breaking News

ఇల్లు అమ్ముతున్నారా?.. ఇలా ఉంటే మంచి రేటు..

Published on Sat, 06/14/2025 - 15:13

కొనేటప్పుడు తక్కువ ధరకు రావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువ రేటు రావాలనుకునేది ఒక్క స్థిరాస్తిలో మాత్రమే. ప్రస్తుతం మార్కెట్లో బూమ్‌ లేదు కాబట్టి మనం కోరుకున్న ధర రావడం కొద్దిగా కష్టమే. అయితే కొంచెం ప్రణాళిక, మరికొంచెం నేర్పుతో కాసింత ఖర్చు పెడితే చాలు ప్రతికూల సమయంలోనూ స్థిరాస్తి అమ్మేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో

ఇంటి ధరను ప్రధానంగా స్థిరాస్తి ఉన్న ప్రాంతం, దాని నిర్మాణ ఖర్చులు, స్థలం ధర నిర్ణయిస్తాయి. అయితే పూర్తిగా ఈ అంశాలే ధరను నిర్ణయించలేవు. మార్కెట్‌ సెంటిమెంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. గిరాకీ, సరఫరా కూడా కొంతమేర ప్రభావం చూపుతాయి. కాబట్టి స్థిరాస్తిని విక్రయించాలనుకున్నప్పుడు ముందుగా మార్కెట్‌ స్థితిగతుల్ని అధ్యయనం చేయాలి. ధరల పోకడ, ఆ ప్రాంతంలో సగటు ధర వంటి విషయాలపై దృష్టిపెట్టాలి.

వసతులే కీలకం.. 
ఒక ఇంటి అంతిమ విలువ రెండు రకాలుగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం నివసించడానికి సౌకర్యాలన్నీ ఉన్నాయా? ఒకవేళ భవిష్యత్తులో ఇల్లు అమ్మాలనుకుంటే మంచి ధర వస్తుందా? ఈ రెండు అంశాలు ముఖ్యం. ఉదాహరణకు చేరువలో షాపింగ్‌ మాల్స్‌ లేదా దుకాణాలు ఉన్నాయా? స్కూళ్లు, ఆస్పత్రులు, రవాణా సదుపాయాలు వంటివి ఉన్నాయా లేదా అనేవి చూడాల్సిందే.. చుట్టుపక్కల వాళ్లు స్నేహపూర్వకంగా ఉంటేనే ప్రశాంతంగా నివసించవచ్చు. కొత్తగా పెళ్లయిన జంటలకు స్కూళ్ల అవసరం ఉండదు కాబట్టి ఇల్లు కొనే ముందు ఈ అంశం గురించి పట్టించుకోరు. కాకపోతే ఇంటిని 
అమ్మాలనుకుంటే మాత్రం ఇదే కీలకం.

సౌకర్యాలే ముఖ్యం కాదు.. 
ఇల్లు కొనే ప్రతి ఒక్కరూ తమ సౌకర్యాల్నే చూసుకోకూడదు. భవిష్యత్తు అవసరాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కారు లేదా బైకు ఉన్నవారికి ప్రజారవాణా వ్యవస్థ అవసరం ఉండకపోవచ్చు. ఇవే అంశాలు ఇతరులకు ముఖ్యమవుతాయని గుర్తుంచుకోండి. ఇంటిని అమ్మేటప్పుడు ఇలాంటివే కీలకంగా మారతాయి. చేరువలోనే షాపింగ్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటే.. భవిష్యత్తులో ఇల్లు విక్రయించే సమయంలో కొనేవారికి ఇవే కీలకమవుతాయి. ఇలాంటి అంశాల ఆధారంగా ఇంటి విలువ లెక్కగడతారని గుర్తుంచుకోవాలి.

చిక్కులుండొద్దు.. 
స్థిరాస్తికి ఎన్ని అనుకూలతలు ఉన్నా ఓ విషయంలో మాత్రం చిన్నపాటి తేడా ఉన్నా కొనుగోలుదారులు ముందుకురారు. అదే న్యాయపరమైన అంశం. మీరు విక్రయించాలనకున్న స్థిరాస్తికి సంబంధించిన న్యాయపరమైన అంశాల్ని కొనుగోలుదారులకు స్పష్టంగా వివరించాలి.  

ప్రాంతం కూడా ముఖ్యమే.. 
మన ఇంటికి అధిక ధర రావాలంటే అది ఉన్న ప్రాంతమూ ముఖ్యమే. ఇంట్లోని వసతులను మార్చినట్టుగా ప్రాంతాన్ని మార్చలేము. కాకపోతే మన ఇంటి నిర్మాణం ఎంత అభివృద్ధి చెంది ఉంటుందో ఆ ప్రాంతం కూడా అంతే వృద్ధి చెంది ఉంటుందనేది మర్చిపోవద్దు. అంటే ఇంట్లోని వసతులకే కాదు ఇంటికి దగ్గర్లో పాఠశాలలు, ఆస్పత్రులు, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ ఉండాలన్నమాట. ఇంటికి లిఫ్ట్, పార్కింగ్‌ వంటి వసతులతో పాటు మెయిన్‌ రోడ్డుకు వెళ్లేందుకు అనువైన రోడ్డు ఉండాలి.

👉 ఇది చదవలేదా? రుణంతోనే సొంతిల్లు.. ఇలా ఎక్కువగా కొంటున్నదెవరంటే..

నిర్వహణతోనే రెట్టింపు విలువ.. 
గేటెడ్‌ కమ్యూనిటీల్లో పిల్లలు, పెద్దలకు ప్రత్యేకంగా పార్కులు, ఆట స్థలాలు, స్విమ్మింగ్‌ పూల్, జిమ్‌ వంటి ఆధునిక సదుపాయాలు కల్పించగానే సరిపోదు. వాటిని పక్కాగా నిర్వహించే సామర్థ్యం ఉండాలి. అప్పుడే ఇంటి విలువ రెట్టింపు అవుతుంది. ప్రతి ఫ్లాట్‌ యజమానులతో స్నేహపూర్వకంగా మెలగాలి. విద్యుత్, డ్రైనేజీ, తాగునీటి, లిఫ్టు వంటి మౌలిక వసతుల నిర్వహణకు ఉద్యోగులుండాలి. అప్పుడే ఆ గృహ సముదాయం బాగుంటుంది. ఇంటి విలువ కేవలం ఫ్లాట్‌కో.. ప్లాట్‌కో పరిమితం కాదు.. సౌకర్యాలు, నిర్వహణతో కలిపి ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈమధ్య కాలంలో వైఫై, జనరేటర్, హౌజ్‌ కీపింగ్‌ వంటి వసతులూ ఉంటేనే ధర ఎక్కువ పలుకుతోంది. ఫుల్లీ ఫర్నీచర్, సెమీ ఫర్నీచర్‌ ఫ్లాట్లకు ఎక్కువే రేటు వస్తుంది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)