Breaking News

మొబైల్‌ రీచార్జ్‌ ధరలు మరోసారి పెరుగుతాయా?

Published on Sun, 11/17/2024 - 08:23

న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు మరోసారి చార్జీలు పెంచే అవకాశం ఉందా? ఇన్వెస్టర్లతో ఎర్నింగ్స్‌ కాల్‌ సందర్భంగా వొడాఫోన్‌ ఐడియా సీఈవో అక్షయ మూంద్రా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఎక్కువ డేటాను వినియోగించే టెలికం చందాదారులు పరిశ్రమకు సహేతుక రాబడిని అందించడానికి, సమాజంలోని అన్ని వర్గాలకు కనెక్టివిటీని చేర్చడానికి మరింత చెల్లించాలని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

కొత్త టెక్నాలజీ వినియోగానికి, డేటా వృద్ధికి తోడ్పడటానికి భారీ పెట్టుబడులు అవసరమని, అదే సమయంలో సమాజంలోని అన్ని వర్గాలకు కనెక్టివిటీని అందించడానికి టారిఫ్‌లు అందుబాటు ధరలో కొనసాగించాలని ఆయన అన్నారు. పెట్టుబడిపై సహేతుక రాబడిని అందుకోవడానికి పరిశ్రమకు వీలు కల్పించేందుకు డేటాను మరింత ఎక్కువగా ఉపయోగించే కస్టమర్లు ఎక్కువ చెల్లించినప్పుడు ఇది సాధ్యమవుతుందని వివరించారు.

ఇదీ చదవండి: Jio: టీ ధర కంటే తక్కువకే 10 జీబీ డేటా

పరిశ్రమ తన మూలధన వ్యయాన్ని తిరిగి పొందేందుకు టారిఫ్‌ల హేతుబద్ధీకరణ అవసరం అని నొక్కి చెప్పారు. టారిఫ్‌ పెంపు ఫలితంగా కంపెనీ త్రైమాసిక ప్రాతిపదికన కస్టమర్లను కోల్పోయినప్పటికీ.. మరొకసారి టారిఫ్‌ల పెంపు అవసరమని సూచించారు. టారిఫ్‌ల సవరణ కారణంగా రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా భారీగా చందాదార్లను కోల్పోయాయి. అత్యధికులు బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారారు. ‘సెప్టెంబర్‌ త్రైమాసికంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రభావం ఉంది. ఆగస్ట్‌ నుండి క్రమంగా నవంబర్‌ వరకు ఆ ప్రభావం చాలా త్వరగా తగ్గుతోంది’ అని మూంద్రా అన్నారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)