Breaking News

కొంపముంచిన ప్రకటన..టీసీఎస్‌కు 15 వేల కోట్ల నష్టం!

Published on Sat, 06/17/2023 - 16:18

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో రెండో అత్యంత విలువైన సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)కు వ్యాపారం పరంగా ఎదురు దెబ్బ తగిలింది. టీసీఎస్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ట్రాన్సామెరికా ప్రకటించింది. దీంతో టీసీఎస్‌ వేల కోట్లు నష్టపోయినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

అమెరికా కేంద్రంగా ట్రాన్సామెరికా హెల్త్‌ ఇన్సూరెన్స్‌తో పాటు ఇతర ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే,  2018 నుంచి 10 ఏళ్ల కాలానికి సేవలు పొందేందుకు దేశీయ టెక్‌ దిగ్గజంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ డీల్ విలువ దాదాపు 2 బిలియన్ డాలర్లు. 

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి కారణంగా టీఎస్‌ఎస్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ట్రాన్సామెరికా ప్రకటించింది. ఈ ప్రకటనతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో టీసీఎస్‌ మార్కెట్‌ వ్యాల్యూ రూ.11,76,842 కోట్ల నుంచి రూ.11,61,840 వద్ద స్థిర పడింది. రూ.15,000 కోట్ల సంపద తరిగింది.  

ఏడాదికి 200మిలియన్ల ఆదాయం
2018 నుంచి ట్రాన్సామెరికాకు టీసీఎస్‌ సర్వీసుల్ని అందిస్తుంది. అందుకు గాను దేశీ టెక్‌ దిగ్గజం ఏడాదికి 200 మిలియన్ డాలర్ల ఆదాయన్ని గడిస్తుంది. ఈ సందర్భంగా అమెరికన్‌ ఆర్ధిక సేవల సంస్థ జేపీ మోర్గాన్‌.. తాము సైతం ఆర్ధిక అనిశ్చితి ఇబ్బంది పడుతున్నట్లు ఓ నివేదికను విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితులు గణనీయమైన లాభాల్ని సైతం పరిమితం చేస్తున్నట్లు తెలిపింది.

చదవండి👉 ‘మాకొద్దీ ఉద్యోగం’..టీసీఎస్‌కు షాకిస్తున్న మహిళా ఉద్యోగులు!

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)