Breaking News

బంగారం డోర్‌ డెలివరీ.. సెక్యూరిటీ చూశారా?

Published on Thu, 05/01/2025 - 21:24

కాదేదీ డోర్‌ డెలివరీకి అనర్హం అన్నట్లు ఆర్డర్‌ ఇస్తే చాలు ఇప్పుడు ప్రతీదీ ఇంటి ముంగిటకే వచ్చేస్తోంది. ఈ ఏడాది అక్షయ తృతీయను పురస్కరించుకుని ప్రముఖ క్విక్‌ కామర్స్‌ సంస్థ స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ నిత్యావసర సరుకుల మాదిరిగానే బంగారాన్నీ డెలివరీ చేస్తామంటూ ముందుకు వచ్చింది. అయితే డోర్ స్టెప్ గోల్డ్ డెలివరీ కోసం ఆ కంపెనీ చేసిన హై సెక్యూరిటీ ఏర్పాట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్న వరుస వైరల్ వీడియోలు నెటిజనుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా విస్తృతంగా షేర్ అవుతున్న ఒక వీడియో క్లిప్‌లో స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్.. సెక్యూరిటీ గార్డుతో కలిసి ట్రాఫిక్‌లో బైక్‌పై వెళ్తూ కనిపించారు. అందులో సెక్యూరిటీ గార్డు ఒక చేతిలో లాఠీ, మరో చేతిలో హై సెక్యూరిటీ లాకర్ పట్టుకొని కనిపించాడు. ఈ వీడియో వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

"ఏమి జరుగుతోంది?" అంటూ ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ప్రశ్నించగా "రియల్ గోల్డ్ డెలివరీ కర్నే కే లియే రియల్ సెక్యూరిటీ చాహియే బ్రో (రియల్ గోల్డ్ కోసం రియల్ సెక్యూరిటీ కావాలిగా) అని స్విగ్గీ చమత్కారంగా బదులిచ్చింది. ఆన్ లైన్ లో ప్రచారం ఊపందుకోవడంతో స్విగ్గీ ఇన్ స్టామార్ట్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో వైరల్ వీడియోలను రీపోస్ట్ చేసింది. దీనికి బంగారమా? నిజంగానా?' అంటూ మరో యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేయగా దీనికి కూడా ‘డెలివరింగ్‌ సోనా ఇన్‌ ఎవరీ కోనా కోనా’(ప్రతి మూలకూ బంగారం డెలివరీ) అంటూ స్విగ్గీ రిప్లయి ఇచ్చింది.

కాగా కల్యాణ్ జ్యువెల్లర్స్ నుంచి వివిధ బరువుల బంగారు, వెండి నాణేలను నిమిషాల్లో కస్టమర్లకు డెలివరీ చేయనున్నట్లు స్విగ్గీ ఇన్‌‌స్టామార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. క్విక్ కామర్స్ సర్వీస్ ద్వారా లభించే నాణేలలో 0.5 గ్రాములు, 1 గ్రాము బంగారు నాణేలు, అలాగే 5 గ్రాములు, 10 గ్రాములు, 20 గ్రాముల వెండి నాణేలు ఉన్నాయి.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)