Breaking News

పౌరుల గోప్యతను పాటించకపోతే దేశం విడిచి వెళ్లిపోండి: సుప్రీంకోర్టు

Published on Tue, 02/03/2026 - 13:06

సాంకేతికత లేదా వ్యాపార పద్ధతుల పేరుతో భారత పౌరుల గోప్యతా హక్కును హరించలేరని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. డేటా షేరింగ్ నెపంతో ప్రజల వ్యక్తిగత సమాచారంతో ఆటలాడటం సరికాదని మెటా, వాట్సాప్ సంస్థలను అత్యున్నత ధర్మాసనం తీవ్రంగా హెచ్చరించింది. దీనిలో పౌరుల గోప్యతను పాటించకపోతే దేశం విడిచి వెళ్లిపోవచ్చని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ హెచ్చరించారు.

సమాచారాన్ని దొంగిలించడానికి ఇదో మార్గం

వాట్సాప్ తీసుకొచ్చిన వివాదాస్పద గోప్యతా విధానంపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. వినియోగదారుల ‘సమ్మతి’(Consent), ‘ఆప్ట్-అవుట్’(వైదొలగడం) మెకానిజంపై కంపెనీల వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ‘టెక్ కంపెనీల నిబంధనలు సామాన్యులకు అర్థం కానంత తెలివిగా రూపొందించారు. అసలు ‘వైదొలగడం’(ఆప్ట్-అవుట్) అనే విధానం ఎక్కడ ఉంది? ఇది ప్రైవేట్ సమాచారాన్ని దొంగిలించడానికి ఒక తెలివైన మార్గం’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

కేసు నేపథ్యం ఏమిటి?

2021లో వాట్సాప్ ప్రవేశపెట్టిన గోప్యతా విధానంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ.213.14 కోట్ల భారీ జరిమానా విధించింది. దీన్ని సవాలు చేస్తూ మెటా సంస్థ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)ను ఆశ్రయించగా అక్కడ కూడా కంపెనీకి చుక్కెదురైంది. వినియోగదారులు వాట్సాప్ వాడాలంటే తప్పనిసరిగా డేటా షేరింగ్‌కు అంగీకరించాలనే నిబంధన వినియోగదారులను బలవంతం చేయడమేనని గతంలో ఎన్‌సీఎల్‌ఏటీ స్పష్టం చేసింది. వాట్సాప్ తన మార్కెట్ ఆధిపత్యాన్ని ఉపయోగించుకుని అన్యాయమైన నిబంధనలను విధిస్తోందని రెగ్యులేటర్లు నిర్ధారించాయి.

దేశం నుంచి వెళ్లిపోండి.. వాట్సాప్ కు సుప్రీంకోర్టు వార్నింగ్

కేసు పరిధి విస్తరణ

ఈ వివాదాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు కేసు పరిధిని మరింత విస్తరించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను (మైటీ) ఈ విచారణలో చేర్చింది. ఈ వ్యవహారంపై ఫిబ్రవరి 9వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం ప్రకటించింది. ప్రకటనల ప్రయోజనాల కోసం మెటా గ్రూప్ కంపెనీలతో డేటాను పంచుకోవడాన్ని ఐదేళ్లపాటు నిషేధించిన సీసీఐ ఉత్తర్వులను కూడా పరిగణనలోకి తీసుకుని పౌరుల డేటా రక్షణపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది.

ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు

Videos

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)