Breaking News

భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. ఎయిర్‌టెల్ మెరుపులు

Published on Thu, 03/20/2025 - 15:37

బెంచ్ మార్క్ భారతీయ ఈక్విటీ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. వివిధ రంగాలలో కొనుగోళ్లకు దారితీయడంతో 1 శాతానికి పైగా లాభపడ్డాయి. 30 షేర్ల సెన్సెక్స్ 899.01 పాయింట్లు లేదా 1.19 శాతం పెరిగి 76,348.06 వద్ద స్థిరపడింది. ఈ సూచీ ఈరోజు 76,456.25-75,684.58 రేంజ్‌లో ట్రేడ్ అయింది.

ఇక నిఫ్టీ 50 కూడా 283.05 పాయింట్లు (1.24 శాతం) పెరిగి 23,190.65 వద్ద ముగిసింది. ఈ ఇండెక్స్ 23,216.70 వద్ద రోజు గరిష్టాన్ని, 22,973.95 వద్ద కనిష్టాన్ని తాకింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.64 శాతం, 0.70 శాతం లాభపడ్డాయి.

ఎన్ఎస్ఈలోని అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్, మీడియా, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా లాభపడ్డాయి.

సెన్సెక్స్ లోని 30 షేర్లలో ఈ రోజు కేవలం మూడు మాత్రమే నష్టాలను చవిచూశాయి.  భారతీ ఎయిర్ టెల్ 4 శాతం లాభంలో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు కూడా రాణించాయి. భారతీ ఎయిర్ టెల్ షేర్లు నిఫ్టీలోనూ మెరుపులు మెరిపించింది.  నిఫ్టీ 50 షేర్లలో 4 మాత్రమే నష్టాలను చూశాయి.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)