Breaking News

రైల్వే ప్లాట్‌ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ!

Published on Mon, 07/27/2026 - 17:17

Satyanarayan Nuwal Success Story అత్యంత తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి, విజయం సాధించి బిలియనీర్‌గా అవతరించిన వ్యాపారవేత్తల విజయగాథల గురించి చాలానే విన్నాం. అయితే జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా, ఎన్న సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి  ఏకంగా  రూ.72000 కోట్ల ఆస్తికి యజమాని  అయిన సక్సెస్‌ స్టోరీ విన్నారా? చేతిలో చిల్లి గవ్వ  లేని స్థితి నుండి.. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై పడుకునే స్థాయి నుండి మొదలై.. పట్టుదలతో దేశంలోనే అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్తలలో ఒకరిగా నిలిచిన సత్యనారాయణ్ నువాల్ జీవితం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం. పదండి ఈ వివరాలేంటో  తెలుసుకుందాం.

రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన అతని పేరే 72 ఏళ్ల సత్యనారాయణ్ నువాల్ (Satyanarayan Nuwal). సుమారు రూ. 45,650 కోట్ల నికర ఆస్తితో నాగ్‌పూర్‌లోని అత్యంత ధనవంతుడు. సత్యనారాయణ్ నువాల్ సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల 10వ తరగతితోనే చదువు ఆపేసాడు.   18-19 ఏళ్లకే వివాహం, బాధ్యతలు నెత్తినపడ్డాయి.  రాజస్థాన్‌లోని భిల్వారాలో పట్వారీగా పనిచేసిన అతని తండ్రి 1971లోనే రిటైర్ అయ్యారు. తాతగారు ఒక చిన్న కిరాణా కొట్టు నడిపేవారు, సపోర్ట్ చేయడానికి ఎలాంటి కుటుంబ వ్యాపారం లేదు. 18 ఏళ్ల వయసులో సిరా (Ink) తయారీ యూనిట్‌ను ప్రారంభించినా అది విఫలమైంది. దాంతో బతుకుదెరువు కోసం కొత్త ప్రాంతానికి వచ్చాడు.

చేతిలో పైసా లేకుండా, ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో చేరుకున్నాడు. 1977లో, మహారాష్ట్రలోని బల్హార్షా రైల్వే స్టేషన్‌కు  చేరాడు. ఆ రాత్రి అతనికి ఆశ్రయం ఆ రైల్వే ప్లాట్‌ఫారమే అయింది. ఆ రాత్రి ప్లాట్‌ఫారమ్‌పై పడుకున్నప్పుడు, భవిష్యత్తులో తన జీవితం ఎలా మారబోతోందో అతనికి కనీసం ఊహ కూడా లేదు.ఇల్లు అద్దెకు తీసుకోవడానికి కూడా ఆయన దగ్గర తగినంత డబ్బు ఉండేది కాదు. దీంతో ఆయన చాలా రాత్రులు రైల్వే స్టేషన్‌లోనే గడపవలసి వచ్చింది. ఆ రోజుల్లో జీవనోపాధి కోసం ఆయన ఫౌంటెన్ పెన్నులు కూడా అమ్మేవారు.

చిన్న అడుగుతో మొదలైన వ్యాపారం
బల్హార్షాలో నువాల్‌కు అబ్దుల్ సత్తార్ అల్లాభాయ్ పరిచయమయ్యారు. ఆయన బావులు తవ్వడానికి, రోడ్లు వేయడానికి, బొగ్గు గనులకు ఉపయోగించే పేలుడు పదార్థాల (Explosives) వ్యాపారి. నువాల్ దీనిని ఒక అవకాశంగా మలుచుకున్నాడు. నెలకు  వెయ్యి రూపాయల అద్దె చెల్లించి అబ్దుల్ సత్తార్ లైసెన్స్‌ను ఉపయోగించుకుని వ్యాపారం ప్రారంభించాడు. 25 కేజీల పేలుడు పదార్థాలను రూ. 250కి కొని, రూ.800కి అమ్మేవాడు. లాభాలు తక్కువే అయినా, అది నిజాయితీతో కూడిన శ్రమ.

త్వరలోనే ఆయన కష్టపడే తత్వాన్ని, నిజాయితీని బ్రిటిష్ కంపెనీ 'ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్' అధికారులు గుర్తించారు. ఇది ఆయనకు వ్యాపారంలో సరికొత్త తలుపులు తెరిచింది. ఒక చిన్న వ్యాపారిగా ఉన్న నువాల్, ఎక్స్‌ప్లోజివ్స్ బిజినెస్‌లోని మెళకువలను లోతుగా నేర్చుకున్నాడు.

'సోలార్ ఇండస్ట్రీస్'  అద్భుత ప్రగతి
1995లో, తన 37వ ఏట నువాల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి  రూ.60 లక్షల రుణం తీసుకుని సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా (Solar Industries India) పేరుతో ఒక చిన్న తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. చాలామంది ఇది పెద్ద రిస్క్ అనుకున్నారు, కానీ నువాల్ తనపై నమ్మకంతో ముందడుగు వేశారు.

2006 IPO
ఐపీఓ (IPO)కి వెళ్లే సమయానికి  రూ.78 కోట్ల టర్నోవర్, రూ.11 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఈ నిధులతో దేశవ్యాప్తంగా 13 తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసింది.  ప్రస్తుతం సోలార్ ఇండస్ట్రీస్ భారతదేశంలోని 9 రాష్ట్రాల్లో, 29 నగరాల్లో తయారీ కేంద్రాలను కలిగి ఉంది. వీటితో పాటు జాంబియా, ఘనా, నైజీరియా, టర్కీ, టాంజానియా మరియు సౌత్ ఆఫ్రికాలలో 6 విదేశీ యూనిట్లను నడుపుతోంది.

రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర
2010లో భారతదేశ రక్షణ దళాలకు (Defence Forces) వార్‌హెడ్ల కోసం పేలుడు పదార్థాలను తయారు చేసే లైసెన్స్‌ను భారత ప్రభుత్వం నుండి పొందిన మొదటి ప్రైవేట్ కంపెనీగా సోలార్ ఇండస్ట్రీస్ రికార్డు సృష్టించింది.

'మేక్ ఇన్ ఇండియా' మిషన్‌లో భాగంగా కంపెనీ ఎక్స్‌ప్లోజివ్స్, ప్రొపెల్లెంట్స్, గ్రెనేడ్లు, డ్రోన్లు మరియు వార్‌హెడ్ల తయారీని ప్రారంభించింది. పినాకా (Pinaka) రాకెట్లు: ఈ రాకెట్ల కమర్షియల్ ప్రొడక్షన్ కంపెనీకి ఒక మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం రక్షణ రంగం నుంచి అంతర్జాతీయ ఆర్డర్లు భారీగా పెరుగుతున్నాయి. కంపెనీ రాబడిలో మెజారిటీ భాగం ఎగుమతుల (Exports) ద్వారానే వస్తోంది.

2026 జులై నాటికి సోలార్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు  రూ,1.69 లక్షల కోట్లకు చేరుకుంది. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో స్థానం పొందిన నువాల్ ఆస్తి విలువ సుమారు  రూ.7.5 బిలియన్ డాలర్లు (రూ.72,000 కోట్లకు పైగా).

ఇదీ చదవండి: హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ నా జీవితాన్నే మార్చేసింది

పద్మశ్రీ పురస్కారం
2026, మే 25న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో దేశ రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను పెంపొందించినందుకు గాను సత్యనారాయణ్ నువాల్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 'పద్మశ్రీ' అవార్డును ప్రదానం చేశారు. ఇంతఎత్తుకు ఎదిగినా ఆయన తన మూలాలను మరచిపోలేదు. నాగ్‌పూర్ పరిసర ప్రాంతాలలో విద్య, సమాజ అభివృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు విస్తృతంగా విరాళాలు అందిస్తూ గొప్ప దాతగా పేరు గాంచారు.

ఇదీ చదవండి: వీకెండ్‌ క్లాస్‌లో ఐఐఎం ప్రొఫెసర్‌ సర్‌ప్రైజ్‌, నెటిజన్లు ఫిదా
 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)