Breaking News

భారత్‌ ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం

Published on Sat, 06/24/2023 - 04:04

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫైనాన్షింగ్‌కు సంబంధించి ఒక కొత్త ఒప్పంద ఖరారుకు పారిస్‌లో జరుగుతున్న సదస్సులో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పలు దేశాలతో భారత్‌ ద్వైపాక్షిక సంబంధాల మెరుగుపై దృష్టి సారించారు. ఫ్రాన్స్, బ్రెజిల్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఆర్థికమంత్రులతో ఆమె వేర్వేరుగా చర్చలు జరిపారు.  భారత్‌ ప్రెసిడెన్సీలో కీలక జీ20 దేశాల దృష్టి సారించిన అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.

బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులను (ఎండీబీ) బలోపేతం చేయడం, రుణ సమస్యల నిర్వహణపై కూడా వీరి సమావేశంలో కీలక చర్చ జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 22–23 తేదీల్లో జరిగిన ఈసమావేశాలను భారత్, ఫ్రాన్స్, బర్బాడోస్‌లు నిర్వహించాయి. వాతావరణ మార్పు, జీవవైవిధ్య సంక్షోభం, అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి బ్రెట్టన్‌ వుడ్స్‌ వ్యవస్థకు మించిన కొత్త గ్లోబల్‌ ఫైనాన్సింగ్‌ ఆర్కిటెక్చర్‌కు పునాదులు ఏర్పాటు చేయడం ’న్యూ గ్లోబల్‌ ఫైనాన్సింగ్‌ ప్యాక్ట్‌’ శిఖరాగ్ర సమావేశం లక్ష్యం.   

డీపీఐతో ప్రజా సొమ్ము ఆదా : సీతారామన్‌
కాగా పన్ను చెల్లింపుదారులు చెల్లించే డబ్బులు చక్కగా వినియోగించుకోవడానికి డిజిటల్‌ ప్రజా మౌలిక వసతులు (డీపీఐ) ఉపకరిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. భారత సర్కారు నేడు ఎన్నో రకాల ప్రయోజనాలను నేరుగా లబి్ధదారుల బ్యాంకు ఖాతాలకు అందించగలుగుతున్నట్టు చెప్పారు.

ప్రభుత్వ వ్యవస్థలో డీపీఐ గొప్ప సమర్థతను తీసుకొచి్చందని, నిధులను మెరుగ్గా వినియోగించడం సాధ్యపడినట్టు తెలిపారు. డీపీఐని ప్రవేశపెట్టిన తర్వాత కేవలం ఒక రాష్ట్రంలోనే డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ రూపంలో రూ.లక్ష కోట్లను ఆదా చేసినట్టు చెప్పారు. మహిళలకు ఇచి్చన రుణ ఖాతాల పనితీరు మెరుగ్గా ఉందన్నారు. నూతన గ్లోబల్‌ ఫైనాన్సింగ్‌ ఒప్పందం విషయమై ప్రస్తుతం నిర్మలా సీతారామన్‌ ప్యారిస్‌లో పర్యటిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)