Breaking News

కొత్త రేటుకు వెండి: రాబర్ట్ కియోసాకి

Published on Fri, 10/10/2025 - 16:44

బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఈ తరుణంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

వెండి 50 డాలర్లు దాటేసింది, తరువాత 75 డాలర్లకు?.. సిల్వర్, ఎథిరియం హాట్, హాట్ (ధరలు భారీగా ఉన్నాయని) అంటూ కియోసాకి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.

వెండి రేటు గ్లోబల్ మార్కెట్లో.. మొదటిసారి ఔన్స్‌కు 50 డాలర్ల స్థాయికి చేరి, 2012 నాటి గరిష్టాన్ని చెరిపేసింది. ఇన్నాళ్ల తర్వాత తిరిగి వెండికి బలమైన డిమాండ్‌ కనిపిస్తోంది. పరిశ్రమల నుంచి పెరుగుతున్న డిమాండ్ మాత్రమే కాకుండా.. అమెరికా టారిఫ్స్ కూడా వెండి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని నిపుణుల అభిప్రాయం.

ఇదీ చదవండి: 'రేటు మరింత పెరగకముందే.. కొనేయండి': రాబర్ట్ కియోసాకి

భారతదేశంలో 2025 అక్టోబర్ ప్రారంభంలో రూ. 1,61,000 వద్ద ఉన్న సిల్వర్ రేటు.. ఈ రోజు (అక్టోబర్ 10) రూ. 1,80,000 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే 10 రోజుల్లో వెండి ధరలు ఎంతగా పెరిగాయో.. స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అక్టోబర్ 7 (గురువారం) వెండి రేటు ఏకంగా రూ. 7,000 పెరిగి.. ఒక్కసారిగా షాకిచ్చింది. ఈ రోజు (శుక్రవారం) కూడా సిల్వర్ రేటు రూ. 3000 పెరిగింది. దీంతో ఒక గ్రామ్ సిల్వర్ రేటు 180 రూపాయలకు చేరింది.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)