Breaking News

ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసా?

Published on Thu, 06/18/2026 - 16:08

భారతదేశంలో రైలు ప్రయాణం అనేది కేవలం ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లే ప్రయాణం మాత్రమే కాదు. అది ఒక ప్రత్యేక అనుభవం కూడా. సందడిగా ఉండే రైల్వే స్టేషన్లు, ప్రకృతి అందాలను చూపించే మార్గాలు, ప్రయాణంలో కలిసే కొత్త వ్యక్తులు ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఇవన్నీ రైలు ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాయి. అయితే.. టికెట్ బుకింగ్ సమయంలో లేదా రిజర్వేషన్ స్టేటస్ చెక్ చేసే సమయంలో కనిపించే కొన్ని రైల్వే పదాలు చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఈ పదాల అర్థం తెలుసుకుంటే మీ ప్రయాణం మరింత సులభంగా.. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సాగుతుంది.

ఆర్ఏసీ (RAC)
RAC అంటే రిజర్వేషన్ అగెనెస్ట్ క్యాన్సిలేషన్. ఈ స్టేటస్ ఉన్న ప్రయాణికుడికి ఫుల్ బెర్త్ లభించదు. కానీ రైలులో ప్రయాణించవచ్చు. అయితే.. ఒక సీటును ఇద్దరు ఆర్ఏసీ ప్రయాణికులు పంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళా ఇతర ప్రయాణికులు తమ టికెట్లు రద్దు చేసుకుంటే, అలాంటి సందర్భంలో ఆర్ఏసీ టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉండటానికి బదులుగా ఆర్ఏసీ మంచి ఎంపికగా భావిస్తారు.

జీఎన్‌డబ్ల్యుఎల్ (GNWL)
GNWL అంటే జనరల్ వెయిటింగ్ లిస్ట్. ఇది రైలు ప్రారంభమయ్యే స్టేషన్ నుంచి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు సాధారణంగా కనిపించే వెయిటింగ్ లిస్ట్ రకం. ఇతర వెయిటింగ్ లిస్ట్‌లతో పోలిస్తే GNWL టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముందుగా టికెట్ బుక్ చేస్తే కన్ఫర్మేషన్ అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి.

టీక్యూడబ్ల్యుఎల్ (TQWL)
TQWL అంటే తత్కాల్ కోటా వెయిటింగ్ లిస్ట్. తత్కాల్ పద్ధతిలో టికెట్ బుక్ చేసినప్పుడు సీటు దొరకకపోతే ఈ స్టేటస్ వస్తుంది. తత్కాల్ కోటాలో సీట్లు పరిమితంగా ఉండటంతో, TQWL టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు GNWL కంటే తక్కువగా ఉంటాయి. ప్రయాణం ప్రారంభమయ్యే వరకు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే అది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. అయితే మీ డబ్బు రీఫండ్ అవుతుంది.

యూటీఎస్ (UTS)
UTS అంటే అన్‌ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్. ఇది రిజర్వేషన్ అవసరం లేని ప్రయాణాల కోసం ఉపయోగించే టికెట్ విధానం. సాధారణంగా చిన్న దూర ప్రయాణాలు లేదా రోజువారీ ప్రయాణాలకు ఇది ఉపయోగపడుతుంది. UTS టికెట్లను కౌంటర్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చు. రద్దీ సమయాల్లో ఈ కోచ్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతాయి, కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది.

ఈ-క్యాటరింగ్
ఈ-క్యాటరింగ్ అనేది ప్రయాణికులు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి, ప్రయాణ సమయంలో దానిని తమ సీటు వద్దకే తెప్పించుకునేందుకు వీలు కల్పించే ఒక సర్వీస్. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా వివిధ రెస్టారెంట్ల నుంచి భోజనాన్ని సెలక్ట్ చేసుకుని, రైలు ప్రయాణ సమయంలో స్టేషన్ వద్ద మీరున్న చోటుకే డెలివరీ పొందవచ్చు. లాంగ్ జర్నీ సమయంలో తాజా, రుచికరమైన ఆహారం (ప్రాంతీయ వంటకాలు) రుచి చూడవచ్చు.

ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు
LHB అంటే లింకే హోఫ్‌మాన్ బుష్. ఇవి ఆధునిక సాంకేతికతతో రూపొందించిన రైల్వే కోచ్‌లు. పాత ఐసీఎఫ్ కోచ్‌లతో పోలిస్తే ఇవి చాలా సురక్షితమైనవి. ప్రయాణ సమయంలో తక్కువ కుదుపులు ఉండటం వల్ల ప్రయాణికులకు మెరుగైన అనుభవం లభిస్తుంది. ప్రస్తుతం రాజధాని, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లలో ప్రధానంగా LHB కోచ్‌లను ఉపయోగిస్తున్నారు.

వికల్ప్ పథకం
వికల్ప్ పథకం అనేది వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రైలులో ప్రయాణించే అవకాశం కల్పించే ప్రత్యేక సదుపాయం. మీ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే, అదే మార్గంలో వెళ్లే మరో రైలులో సీటు కేటాయించే అవకాశం ఉంటుంది. ఈ సేవ పూర్తిగా ఉచితం. ముఖ్యంగా పండుగల సమయంలో లేదా అధిక రద్దీ ఉన్న రోజుల్లో ఇది ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుంది.

భారతీయ రైల్వేలో ఉపయోగించే ఈ ముఖ్యమైన పదాల అర్థం తెలుసుకోవడం వల్ల టికెట్ బుకింగ్ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. RAC, GNWL, TQWL వంటి స్టేటస్‌ల అర్థం తెలిసి ఉంటే మీ టికెట్ పరిస్థితిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే UTS, E-Catering, LHB కోచ్‌లు, వికల్ప్ పథకం వంటి సదుపాయాల గురించి అవగాహన ఉండటం వల్ల మీ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. కాబట్టి ప్రతి రైలు ప్రయాణికుడు ఈ పదాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇదీ చదవండి: రతన్ టాటా స్వయంగా మెయిల్ చేశారు!.. కానీ..

Videos

దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్ కేసులో హై కోర్టు కీలక నిర్ణయం

లోకేష్‌ను అడ్డుకున్న గ్రామస్తులు.. ఎందుకంటే ?

Pulivendula : ఇసుక వేస్తే రాలనంత జనం

జేసీ అనుచరుల కంటే పోలీసులే నీచంగా ప్రవర్తిస్తున్నారు

CI నాగరాజు ఫోన్ ఎక్కడ..? శవాన్ని ఇద్దరూ కలిసే మాయం..!

నీకెందుకు తల్లి మేకప్ మేకప్ అంటే నీకు ప్యాకప్ ఖాయం

పెళ్లి చేసుకుంటానని నమ్మించి... క్రికెటర్ అభిషేక్‌పై మహిళ కేసు

76 ఏళ్లు వచ్చాయి... సిగ్గులేదు! సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టుపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

చంపేందుకే లోహగఢ్ ట్రెక్కింగ్ ప్లాన్ CCTV కెమెరాలో అంతా రికార్డ్

లాకప్ డెత్ చంద్రబాబు ఎలా కప్పిపుచ్చారు..? అసలు నిజాలివే..!

Photos

+5

పులివెందులలో రెండో రోజు వైఎస్‌ జగన్‌ పర్యటన (ఫొటోలు)

+5

ముద్దుల కూతురితో బిగ్‌బాస్ శివజ్యోతి (ఫొటోలు)

+5

సమంతతో రాహుల్ రవీంద్రన్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రోజా పువ్వుతో మ్యాడ్ బ్యూటీ పోజులు.. ఫోటోలు

+5

గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో వైఎస్ జగన్

+5

కలర్‌ఫుల్ చీరల్లో అందాల అదితీరావ్ (ఫొటోలు)

+5

ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు (ఫొటోలు)

+5

టీజీ20 లీగ్‌లో ఆటగాళ్ల సందడి...స్పెషల్‌ అట్రాక్షన్‌గా తిలక్‌ వర్మ (ఫొటోలు)

+5

తిరుమలలో టాలీవుడ్ యంగ్ హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

'పెద్ది' మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్.. చిరు-చరణ్ స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు)