Breaking News

సెబీ కొత్త నిబంధనలు..రియల్‌ టైం షేర్‌ వ్యాల్యూ షేరింగ్‌పై

Published on Sat, 05/25/2024 - 12:31

స్టాక్‌ మార్కెట్‌ మదపర్లకు ముఖ్యగమనిక. వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు థర్డ్‌ పార్టీ యాప్‌లకు రియల్‌ టైమ్‌ షేర్‌ వ్యాల్యూ సమాచారాన్ని అందించే అంశంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.

ఈ సందర్భంగా  నిర్దిష్ట ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, యాప్‌లు, వెబ్‌సైట్‌లు మొదలైనవి రియల్‌ టైం షేర్‌ వ్యాల్యూ ఆధారంగా వర్చువల్ ట్రేడింగ్ (పేపర్‌ కరెన్సీ), పలు ట్రేడింగ్‌ చేయడం ఎలాగో నేర్పించే ఫాంటసీ గేమ్‌ తయారీ సంస్థలకు అందిస్తున్నట్లు దృష్టికి వచ్చింది. అంతేకాదు కొన్ని లిస్టెడ్ కంపెనీలు సైతం సంబంధిత వర్చువల్ స్టాక్ పోర్ట్‌ఫోలియో పనితీరు ఆధారంగా రివార్డ్స్‌ లేదంటే డబ్బుల్ని చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.  

అయితే ఈ విధానంపై పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, వారి సమస్యకు పరిష్కార మార్గంగా సెబీ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది.  

సెబీ  ప్రకారం, అనుమతులు లేకుండా రియల్‌ ట్రైం ట్రేడింగ్‌ వ్యాల్యూ ఏంటనేది మధ్యవర్తులకు చేరవేయకూడదని తెలిపింది. ఒకవేళ్ల పంపించాల్సి వస్తే వ్రాతపూర్వక ఒప్పందాలపై సంతకం చేయాలి. ఈ బాధ్యతల్ని మార్కెట్‌ ఇన్ఫ్రా స్ట్రక్చర్‌ ఇనిస్టిట్యూషన్‌లు (ఎంఐఐఎస్‌)లు పరిశీలించాల్సి ఉంటుందని సెబీ తన మార్గదర్శకాల్లో వెల్లడించింది. సర్క్యులర్ విడుదలైన ముప్పై రోజుల తర్వాత కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. 

ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడం, అవగాహన కల్పించడం కోసం మార్కెట్ ధరల డేటాను పంచుకునేటప్పుడు ఆర్థిక ప్రోత్సాహకాలు అవసరం లేదని సెబీ పేర్కొంది

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)