Breaking News

జనరేటివ్‌ ఏఐ కంటే స్పష్టమైన ఫలితాలిచ్చే దిశగా..

Published on Tue, 12/23/2025 - 09:04

ప్రపంచంలోనే అతిపెద్ద ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఒకటైన సేల్స్ ఫోర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో తన దూకుడును తగ్గించుకుంటోంది. గత ఏడాది కాలంగా లార్జ్‌ ల్యాంగ్వేజీ మోడల్స్‌(LLM) పనితీరుపై నమ్మకం సడలడమే ఇందుకు ప్రధాన కారణం. జనరేటివ్ ఏఐ కంటే మరింత స్పష్టమైన ఫలితాలనిచ్చే నిర్ణయాత్మక (Deterministic)ఆటోమేషన్ వైపు కంపెనీ మొగ్గు చూపుతోంది.

నమ్మకం కోల్పోతున్న ఎగ్జిక్యూటివ్‌లు

‘ఒక సంవత్సరం క్రితం ఎల్‌ఎల్‌ఎంల గురించి మాకున్న నమ్మకం ఇప్పుడు లేదు’ అని సేల్స్ ఫోర్స్ ప్రొడక్ట్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజ్న పరులేకర్ అంగీకరించారు. ఏఐ నమూనాల్లో ఉండే రాండమ్‌నెస్‌(యాదృచ్ఛికం) వల్ల వ్యాపార పనుల్లో తప్పులు దొర్లే ప్రమాదం ఉందని, అందుకే తమ కొత్త ఉత్పత్తి అయిన ఏజెంట్ ఫోర్స్‌లో మరింత నియంత్రిత ఆటోమేషన్‌ను ప్రవేశపెడుతున్నామని ఆమె వెల్లడించారు.

సాంకేతిక వైఫల్యాలే కారణమా?

ఏజెంట్ ఫోర్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మురళీధర్ కృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. AI మోడల్స్‌కు ఎనిమిది కంటే ఎక్కువ సూచనలు (Prompts) ఇచ్చినప్పుడు అవి గందరగోళానికి గురవుతున్నాయి. ముఖ్యంగా..

  • ఎక్కువ సూచనలు ఉంటే ఎల్‌ఎల్‌ఎంలు కీలకమైన ఆదేశాలను వదిలివేస్తున్నాయి.

  • వినియోగదారులు అసంబద్ధమైన ప్రశ్నలు అడిగినప్పుడు ఏఐ తన అసలు లక్ష్యాన్ని మర్చిపోయి పక్కదారి పడుతోంది.

  • 25 లక్షల కస్టమర్లు ఉన్న వివింట్(Vivint) వంటి కంపెనీలు కస్టమర్ సర్వేలను పంపడంలో ఏఐ విఫలమైందని గుర్తించాయి. దీన్ని సరిదిద్దడానికి ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలో ‘ట్రిగ్గర్లను’ ఏర్పాటు చేయాల్సి వస్తోంది.

డేటా ఫౌండేషన్లపై దృష్టి

ఏఐ ద్వారా వేల కోట్లు ఆర్జించవచ్చని భావించిన సేల్స్‌ఫోర్స్‌ సీఈఓ మార్క్ బెనియోఫ్ ఇప్పుడు డేటా ఫౌండేషన్లపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. సరైన డేటా లేకుండా ఏఐ ఇష్టారీతిన ప్రవర్తిస్తుందని చెప్పారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఏఐ ఏజెంట్ల విస్తరణ కారణంగా కంపెనీ తన సహాయక సిబ్బందిని 9,000 నుంచి 5,000కి తగ్గించిందని వెల్లడించారు.

ఇదీ చదవండి: చేసేది ఎక్కువ.. ఇచ్చేది తక్కువ!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)