Breaking News

2026లో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్?: కియోసాకి హెచ్చరిక

Published on Thu, 06/18/2026 - 21:06

రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) స్టాక్ మార్కెట్స్ గురించి సంచనల ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఏడాది (2026) అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం రాబోతోందని కియోసాకి హెచ్చరించారు. 2008లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆర్థిక సంక్షోభం దీనికి ఒక పెద్ద ఉదాహరణ. ఆ సమయంలో అమెరికా హౌసింగ్ మార్కెట్ కుప్పకూలడంతో S&P 500 కూడా దాదాపు 50% వరకు పడిపోయింది. దీనివల్ల అనేక మంది పెట్టుబడిదారులు భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. ఈ సంఘటనను కొందరు 'గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్' అని కూడా పిలుస్తారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం చాలా రిస్క్‌లో ఉందని, అప్పులు, ద్రవ్యోల్బణం, బ్యాంకింగ్ సమస్యల కారణంగా మరో పెద్ద క్రాష్ వచ్చే అవకాశం ఉందని కియోసాకి భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంప్రదాయ పెట్టుబడులపై మాత్రమే ఆధారపడకుండా.. బంగారం, వెండి లేదా ఇతర ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం మంచిదని ఆయన సూచిస్తారు.

అయితే.. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే?, కియోసాకి చెప్పినది కేవలం ఒక అంచనా మాత్రమే. స్టాక్ మార్కెట్ అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ప్రభుత్వ విధానాలు, గ్లోబల్ ఎకానమీ, కంపెనీల పనితీరు, పెట్టుబడిదారుల భావోద్వేగాలు మొదలైనవి ఉంటాయి. కాబట్టి ఎవరు చెప్పినా మార్కెట్ క్రాష్ ఖచ్చితంగా జరుగుతుందని ముందే చెప్పడం సాధ్యం కాదు.

మార్కెట్ క్రాష్ అంటే?
స్టాక్ మార్కెట్ క్రాష్ అంటే షేర్ల ధరలు చాలా తక్కువ సమయంలో భారీగా పడిపోవడం. ఇది ఆర్థిక మాంద్యం, కంపెనీల లాభాలు తగ్గడం లేదా ప్రపంచ ఆర్థిక సంక్షోభాల వల్ల జరుగుతుంది. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు భయంతో షేర్లు అమ్మేయడం వల్ల మార్కెట్ మరింత పడిపోతుంది.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)