Breaking News

రిచ్‌ అవ్వాలంటే కూడబెట్టాల్సింది ఆ ‘ఫేక్‌ డబ్బు’ కాదు..

Published on Sat, 10/18/2025 - 13:12

ప్రముఖ ఇన్వెస్టర్‌, ప్రసిద్ధ పర్సనల్‌ ఫైనాన్స్‌ పుస్తకం ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich dad Poor dad) రచయిత రాబర్ట్ కియోసాకి అమెరికా ద్రవ్య విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ వంటి పెట్టుబడుల పెరుగుదల అనేది వ్యవస్థల వైఫల్యానికి సంకేతమని అని ఆయన హెచ్చరించారు. అమెరికా బేబీ బూమర్ (1946-1964 మధ్య పుట్టినవారు)తరగతికి ఈ ద్రవ్యోల్బణం తీవ్ర ప్రభావం చూపించబోతుందని ఆయన భావిస్తున్నారు.

"ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతారు" అంటూ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో ఓ పోస్ట్‌ చేశారు. "కానీ ద్రవ్యోల్బణం పేద మధ్యతరగతి ప్రజల జీవితాన్ని మరింత కష్టతరం చేస్తుంది." ధరలు పెరుగుతున్నప్పుడు, ఫియట్ మనీ లేదా "నకిలీ డబ్బు" సామాన్య అమెరికన్ల ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథీరియం వంటి "నిజమైన డబ్బు" లో ఆదా చేయాలని ప్రజలకు సూచించారు.

అక్టోబర్ లో బంగారం ధరలో జరిగిన నాటకీయ ర్యాలీని అనుసరించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం, బంగారం ప్రపంచవ్యాప్తంగా ఔన్సుకు 4,250 డాలర్లు, భారతదేశంలో 10 గ్రాములకు రూ.1.31 లక్షల వద్ద (అక్టోబర్‌ 18 నాటికి) ట్రేడ్ అవుతోంది. వెండి కూడా దూసుకెళ్తోంది. అయితే బిట్ కాయిన్ మార్కెట్ గందరగోళం మధ్య 1,21,000 డాలర్ల నుండి 108,000 డాలర్లకు పడిపోయింది.

1947 లో జన్మించిన రాబర్ట్‌ కియోసాకి, తన లాంటి బేబీ బూమర్ తరగతికి ఈ ద్రవ్యోల్బణం బలమైన హానిని కలిగించే అవకాశం ఉందని చెప్పారు. "ద్రవ్యోల్బణం ద్వారా మనం పూర్తిగా తుడిచిపెట్టకుపోతామని" ఆయన హెచ్చరించారు. "మీ అమ్మ, నాన్నలు వీధుల్లోకి రావచ్చు ఎందుకంటే ద్రవ్యోల్బణం వారి సామాజిక భద్రతను తుడిచిపెట్టబోతోంది." అన్నారు.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)