Breaking News

‘బంగారం, వెండి.. అందుకే అక్కడ దాచుకుంటున్నా’

Published on Sun, 07/26/2026 - 14:17

‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, ప్రముఖ పెట్టుబడి నిపుణుడు రాబర్ట్ కియోసాకి అమెరికా పెరుగుతున్న ప్రభుత్వ అప్పులపై మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో చేసిన తాజా పోస్టులో అమెరికా రుణభారం ప్రమాదకర స్థాయికి చేరిందని పేర్కొంటూ, కరెన్సీని పొదుపు చేయడం కంటే వాస్తవ ఆస్తులను (Real Assets) కూడబెట్టడం మంచిదని అభిప్రాయపడ్డారు.

కియోసాకి ప్రకారం.. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం (GFC)కు ముందు అమెరికా ప్రభుత్వ రుణం సుమారు 9.5 ట్రిలియన్ డాలర్లు ఉండగా, ప్రస్తుతం అది 39 ట్రిలియన్ డాలర్లకు చేరువలో ఉందన్నారు. ఇదే సమయంలో అమెరికా బాండ్ మార్కెట్ కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికరమైన పోలికను ప్రస్తావించారు. "మీరు నిమిషానికి ఒక డాలర్ చొప్పున ఖర్చు చేస్తే ఒక ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయడానికి 32 వేల సంవత్సరాలు పడుతుంది. కానీ అమెరికా ప్రభుత్వం దాదాపు ప్రతి 90 రోజులకు ఒక ట్రిలియన్ డాలర్ల మేర కొత్త అప్పు సృష్టిస్తోంది" అని పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల్లో ప్రజలు డబ్బును పొదుపు చేయాలా? అని ప్రశ్నిస్తూ, తన పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’లో చెప్పిన మూడు ప్రధాన ఆర్థిక సూత్రాల్లో ఒకటైన "ధనవంతులు నగదును పొదుపు చేయరు" అనే విషయాన్ని గుర్తు చేశారు.

తాను 1965 నుంచి వెండి, 1971 నుంచి బంగారం, 2012 నుంచి బిట్‌కాయిన్‌, 2022 నుంచి ఎథీరియం కూడబెట్టుకుంటున్నానని కియోసాకి వెల్లడించారు. అలాగే తన బంగారం, వెండి నిల్వలను స్విట్జర్లాండ్ వెలుపల ఉన్న స్విస్ వాల్ట్‌లలో భద్రపరుస్తున్నానని చెప్పారు. గతంలో అమెరికా ప్రభుత్వం బంగారం వ్యక్తిగత యాజమాన్యాన్ని నిషేధించి స్వాధీనం చేసుకున్న చరిత్ర ఉందని కూడా ఆయన తన పోస్టులో ప్రస్తావించారు.

ప్రపంచం ప్రస్తుతం ఆర్థికంగా అల్లకల్లోల పరిస్థితులను ఎదుర్కొంటోందని పేర్కొన్న కియోసాకి, "ఇవి ప్రపంచ చరిత్రలో అత్యంత అనిశ్చిత కాలాలు. జాగ్రత్తగా ఉండండి. నేను చేస్తున్నది ఇదే. మరి మీరు ఏమి చేస్తున్నారు?" అంటూ తన పోస్టును ముగించారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)