Breaking News

అదిగో భారీ క్రాష్‌.. ‘రిచ్ డాడ్’ వార్నింగ్‌!

Published on Sat, 11/01/2025 - 14:04

‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టింగ్‌ గురూ రాబర్ట్‌ కియోసాకి పెట్టుబడుల గురించి మరోసారి హెచ్చరించారు. అంతర్జాతీ మార్కెట్‌ల ఒడిదొడుకుల నేపథ్యంలో ‘భారీ క్రాష్ మొదలంది’ అంటూ ‘ఎక్స్’లో‌ (గతంలో ట్విట్టర్) పోస్ట్‌ పెట్టారు.

లక్షల మంది ఇన్వెస్టర్లు ఆర్థికంగా వినాశనానికి గురవుతారని అంచనా వేశారు. సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థలు హాని కలిగిస్తున్నాయని ఆయన నొక్కిచెప్పారు. వెండి (silver), బంగారం (gold) వంటి విలువైన లోహాలు, బిట్ కాయిన్, ఎథేరియం లాంటి క్రిప్టోకరెన్సీలు తిరోగమనం సమయంలో రక్షణ కవచాలుగా ఉపయోగపడతాయని సూచించారు.

‘భారీ క్రాష్ మొదలంది. కోట్ల కొద్దీ పెట్టుబడులు తుడిచిపెట్టుకుపోతాయి. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. బంగారం, వెండి, బిట్‌ కాయిన్‌, ఎథేరియం పెట్టుబడులే మిమ్మల్ని కాపాడేదది’ అంటూ తన ట్వీట్‌లో రాబర్ట్‌ కియోసాకి రాసుకొచ్చారు.

కియోసాకి (Robert Kiyosaki) ఇలా హెచ్చరించడం ఇదే మొదటిసారి కాదు. 2025 ప్రారంభం ఫిబ్రవరిలో కూడా ఇలాగే "చరిత్రలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్" రాబోతోందంటూ అంచనా వేస్తూ ఇన్వెస్టర్లను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు.

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)