Breaking News

కియోసాకీకి కోపమొచ్చింది!

Published on Sun, 02/08/2026 - 14:01

‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకీ, తాను బిట్‌కాయిన్‌ను 6,000 డాలర్లకి కొనుగోలు చేశానన్న వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలకు స్పందించారు. బిట్‌కాయిన్ కొనుగోలు చేసిన తేదీపై అనవసరంగా దృష్టి పెట్టడం ఇన్వెస్టర్ల  అసలు లక్ష్యాన్ని తప్పుదారి పట్టిస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో వరుస ట్వీట్లు చేశారు.

తనను “అబద్ధం చెబుతున్నాడు” అంటూ ఆరోపించిన వ్యక్తి, బిట్‌కాయిన్‌ను ఏ తేదీన కొనుగోలు చేశానన్న అంశాన్ని ప్రశ్నిస్తున్నాడని కియోసాకీ పేర్కొన్నారు. అయితే తాను గుర్తుంచుకునేది కొనుగోలు చేసిన ధర (strike price) మాత్రమేనని, తేదీ తనకు ప్రాధాన్యం కాదని చెప్పారు.

“నేను ఏ తేదీన బిట్‌కాయిన్ కొన్నానో అతడికి ఎందుకు అంత ఆసక్తి?” అని ప్రశ్నించిన కియోసాకీ, ఆ విమర్శల వెనుక వ్యక్తిగత అజెండా ఉండవచ్చని ఆరోపించారు.

బిట్‌కాయిన్ ధర మళ్లీ 6,000 డాలర్లకి పడితే మరోసారి కొనుగోలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆ సమయంలో తేదీ ఏమిటన్నది తనకు ఎలాంటి ప్రాధాన్యం లేదన్నారు. ప్రస్తుతం తాను మరింత బంగారం కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నానని కూడా వెల్లడించారు.

తన విమర్శకులను ఉద్దేశించి, వారు ఎన్ని బిట్‌కాయిన్లు, బంగారం, వెండి లేదా ఈథీరియం కలిగి ఉన్నారో చెప్పాలని సవాలు విసిరారు. అలాగే అద్దె ఇళ్లు, చమురు బావులు వంటి వాస్తవ ఆస్తులపై కూడా ప్రశ్నించారు. “నేను ఈ ఆస్తులు ఎప్పుడు కొనుగోలు చేశానో నాకు గుర్తులేదు. కానీ వాటిని కొనుగోలు చేశానన్నది మాత్రం ఆనందంగా ఉంది” అని కియోసాకీ అన్నారు.

అలాగే 2026 సంవత్సరానికి చెందిన 60 అమెరికన్ సిల్వర్ ఈగిల్స్ నాణేలు, 20 మిశ్రమ తేదీల గోల్డ్ ఈగిల్స్ కొనుగోలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. వెండి మార్కెట్‌లో ఉన్న కల్లోలం కారణంగా 2026 సిల్వర్ ఈగిల్స్ భవిష్యత్తులో కలెక్టర్ కాయిన్లుగా మారవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

చివరగా, తనను అనుసరించే ఇన్వెస్టర్లకు కియోసాకీ ఒక సూచన చేశారు. “ఆస్తి విలువ, సంఖ్య కంటే కొనుగోలు చేసిన తేదీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. దీర్ఘకాలిక సంపద ఆస్తుల సేకరణతోనే వస్తుంది, తేదీలతో కాదు.” అని ముగించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)