బంగారం, వెండిపై పెట్టింది అప్పుడే అంత అయింది!

Published on Wed, 09/24/2025 - 21:45

ప్రసిద్ధ పర్సనల్‌ ఫైనాన్స్‌ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచియిత రాబర్ట్ కియోసాకి ఎప్పుడూ బంగారం, వెండి, బిట్ కాయిన్‌ల గురించే మాట్లాడుతుంటారు. వాటి మీదే పెట్టుబడులు పెట్టాలని తన ఫాలోవర్లకు సూచిస్తుంటారు. తన ప్రాధాన్యతల నమూనాగా రూపొందించిన పోర్ట్ ఫోలియో అంటే బంగారం, వెండి, బిట్‌కాయిన్‌లపై పెట్టిన పెట్టుబడులు 2025 లో ఇప్పటివరకు దాదాపు 40 శాతం పెరిగాయి.

ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో బంగారం, వెండి, బిట్‌కాయిన్‌లపై పెట్టిన పెట్టుబడులే "నిజమైన డబ్బు" అని రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) చెప్పే మాటకు ప్రాధాన్యత పెరిగింది. ఫిన్ బోల్డ్ రీసెర్చ్ విశ్లేషణ ప్రకారం.. సంవత్సరం ప్రారంభంలో బంగారం, వెండి, బిట్‌ కాయిన్‌.. ఈ మూడు ఆస్తులలో సమానంగా విభజించి 1,000 డాలర్లు పెట్టుబడి పెట్టారనుకుంటే ఆ పోర్ట్ ఫోలియో సెప్టెంబర్ 23 నాటికి 1,372.43 కు పెరిగింది.

ఏది ఎంతలా పెరిగిందంటే..
బంగారం (Gold) 43.06 శాతం లాభంతో ఔన్స్ కు 2,658 డాలర్ల నుంచి 3,754 డాలర్లకు పెరిగింది. వెండి మరింత బలమైన పనితీరును అందించింది. ఔన్స్ కు 29.57 డాలర్ల నుండి 43.89 డాలర్లకు అంటే 47.5 శాతం ఎగిసింది. ఇక బిట్ కాయిన్ 21.17% పెరిగింది. 94,388 డాలర్ల నుండి  113,080 డాలర్లకు చేరింది. వెండి అత్యధిక పనితీరు చూపినా మొత్తం మూడు ఆస్తులు పోర్ట్ ఫోలియో బలానికి అర్థవంతంగా దోహదపడ్డాయని ఫిన్ బోల్డ్ పేర్కొంది.

ఇదీ చదవండి: ప్రపంచంలోనే రెండో ధనవంతుడు.. ఉన్నదంతా ఇచ్చేస్తున్నాడు!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)