Breaking News

డబ్బు సమస్యలు తగ్గాలంటే?: కియోసాకి చెప్పిన సీక్రెట్

Published on Sat, 09/19/2026 - 19:03

పెట్టుబడుల గురించి చెప్పే రాబర్ట్ కియోసాకి.. డబ్బు వల్ల వచ్చే సమస్యల గురించి వివరించారు. దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

1973లో రిచ్ డాడ్ ఒక ప్రశ్న అడిగారని, దాన్ని తాను ఇప్పటికీ మర్చిపోలేదని చెబుతూ.. 'డబ్బుకు సంబంధించిన సమస్యలు రెండు రకాలు మాత్రమే ఉంటాయి' అని అన్నారు. ఒకటి 'డబ్బు సరిపోకపోవడం', మరొకటి 'డబ్బు మరీ ఎక్కువగా ఉండటం'. నేను రెండింటినీ చూస్తూ పెరిగానని కియోసాకి పేర్కొన్నారు.

పూర్ డాడ్ ఎప్పుడూ సరిపడా డబ్బు లేదనే బాధతో ఉండేవారు. రిచ్ డాడ్ పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం.

చాలామంది జీవితంలో డబ్బు సరిపోకపోవడమే పెద్ద సమస్యగా ఉంటుంది. నెలవారీ ఖర్చులు, అప్పులు, పిల్లల చదువు, వైద్యం, ఇంటి అవసరాలు.. ఇలా ఎన్నో ఖర్చుల మధ్య సంపాదించిన డబ్బు సరిపోదని బాధపడుతుంటారు. కానీ మరోవైపు డబ్బు ఎక్కువగా ఉన్నవారికి దాన్ని ఎలా నిర్వహించాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలా కాపాడుకోవాలి, ఎలా మరింత పెంచుకోవాలి అనే సమస్యలు ఉంటాయి. అంటే సమస్య ఇద్దరికీ ఉంది. కానీ సమస్య స్వభావం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

మన ఆలోచనలే ఆర్థిక ప్రపంచం!
అయితే కియోసాకి మాత్రమే.. మన ఆలోచనలే మన ఆర్థిక ప్రపంచాన్ని నిర్మిస్తాయని అంటారు. అంటే మనం డబ్బును ఎలా చూస్తామో, దాని ఆధారంగానే మన నిర్ణయాలు మారుతాయి. ఎప్పుడూ నా దగ్గర డబ్బు లేదు, నాకు ఇది సాధ్యం కాదు, నా సంపాదనతో ఇవన్నీ చేయలేను అని ఆలోచించే వ్యక్తి అవకాశాల కంటే సమస్యలనే ఎక్కువగా చూస్తాడు. డబ్బు కొరతే తన జీవితంలో సహజమైన పరిస్థితి అని భావిస్తాడు.

అదే వ్యక్తి.. నేను దీన్ని ఎలా సాధించగలను?, ఇంకా ఎక్కువ సంపాదించడానికి ఏం చేయాలి?, నా డబ్బును ఎలా పెంచుకోవాలి? అని ఆలోచించడం ప్రారంభిస్తే.. అతని దృష్టి సమస్య నుంచి పరిష్కారం వైపు మళ్లుతుంది. నాకు సాధ్యం కాదు అనే ఆలోచనకు బదులు ‘ఎలా సాధ్యం?’ అని ఆలోచిస్తే.. సమస్యలు తగ్గుతాయంటారు కియోసాకి.

పోటీ ప్రపంచం..
మన చుట్టూ ఉన్న ప్రపంచంలో పోటీ ఎక్కువగా కనిపిస్తుంది. మంచి ఉద్యోగం కోసం పోటీ, ప్రమోషన్ కోసం పోటీ, మంచి మార్కుల కోసం పోటీ.. ఇలా ప్రతి దశలోనూ ఇతరులతో పోల్చుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఆలోచన మారాలి. అంటే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఇతరులు పొందితే మనకు దక్కదని భావించకూడదు. ఒక అవకాశం దక్కకపోతే మరో అవకాశం ఉంటుందని, కొత్త మార్గాలను సృష్టించుకోవచ్చని ఆలోచించాలి.

నిజమైన సంపద
నిజమైన సంపద అనేది కేవలం బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బుతోనే నిర్ణయించబడదు. మనకు వచ్చే ఆదాయాన్ని ఎలా నిర్వహిస్తున్నాం? ఎంత పొదుపు చేస్తున్నాం? ఎలా పెట్టుబడి పెడుతున్నాం? కొత్త ఆదాయ మార్గాలను ఎలా సృష్టించుకుంటున్నాం? వంటి అంశాలు కూడా ముఖ్యమే. అందుకే ఈ మొత్తం ఆలోచనలో ప్రధాన సందేశం.. బయటి ఆర్థిక పరిస్థితులను మార్చాలంటే ముందుగా డబ్బుపై మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. అయితే కేవలం సానుకూలంగా ఆలోచించడం వల్లే సంపద ఏర్పడదు. ఆలోచనతో పాటు ఆర్థిక జ్ఞానం, క్రమశిక్షణ, పొదుపు, సరైన పెట్టుబడులు, రిస్క్‌ను అర్థం చేసుకోవడం, నైపుణ్యాల అభివృద్ధి కూడా అవసరం.

Videos

నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై

టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు

రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్?

తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు..

గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆరోపణలపై ప్రసన్న ఫైర్

చంద్రబాబుకు బిగ్ షాక్.. తిరుమల లడ్డూపై ఈడీ సంచలన ప్రకటన

పద్థతి మార్చుకో.. MLAపై రెచ్చిపోయిన చంద్రబాబు

నిండా ముంచేసిన లలితా జువెల్లరీ స్టాక్.. అసలేం జరిగిందంటే?

అమలాపురంలో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం

Photos

+5

హాఫ్ శారీలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు)

+5

నాని ది ప్యారడైజ్ స్టైలిష్ లుక్‌.. (ఫోటోలు)

+5

గణేశుడి సన్నిధిలో విజయ్‌ దేవరకొండ..(ఫోటోలు)

+5

అందాల అషు.. (ఫోటోలు)

+5

కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు)

+5

ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు)

+5

గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు)

+5

తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు)