Breaking News

బంగారానికి బదులుందా? బెటర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఏది?

Published on Mon, 02/09/2026 - 13:48

ప్రముఖ ఇన్వెస్టర్‌, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి పెట్టుబడుల విషయమై తన అభిప్రాయాలను మరోసారి స్పష్టం చేశారు. బంగారం, వెండి, బిట్‌కాయిన్.. మూడింటినీ కలిపి పెట్టుబడులు పెట్టడం మంచిదేనని చెప్పిన ఆయన, ఒక్క ఆస్తినే ఎంచుకోవాల్సి వస్తే మాత్రం తాను బిట్‌కాయిన్‌కే ప్రాధాన్యం ఇస్తానన్నారు.

ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో, బిట్‌కాయిన్‌కు ఉన్న పరిమిత సరఫరానే దాని అతిపెద్ద బలమని కియోసాకి వివరించారు. బంగారం ధర పెరిగినప్పుడు మరిన్ని గనులు తవ్వడం ద్వారా సరఫరా పెరిగే అవకాశం ఉందని, తాను స్వయంగా గోల్డ్ మైనర్ కావడంతో ఇది తనకు తెలుసని అన్నారు.

“బంగారం ధర పెరిగితే మరిన్ని గనులు తవ్వుతారు. అంటే సరఫరా పెరుగుతుంది. కానీ బిట్‌కాయిన్ విషయంలో అలా కాదు. దాని డిజైన్ ప్రకారం గరిష్టంగా 21 మిలియన్ బిట్‌కాయిన్లే ఉంటాయి” అని కియోసాకి (Robert Kiyosaki)  తెలిపారు. బిట్‌కాయిన్ ప్రోటోకాల్ ప్రకారం 21 మిలియన్లకు మించి ఒక్క బిట్‌కాయిన్ కూడా సృష్టించలేమని, ఆ స్థాయికి మెల్లగా చేరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ విధమైన నిర్మాణాత్మక కొరత  బిట్‌కాయిన్‌ను ప్రత్యేకంగా నిలబెడుతుందని అన్నారు.

ఇది చదివారా? కియోసాకీకి కోపమొచ్చింది!

“21 మిలియన్ల తర్వాత కొత్త బిట్‌కాయిన్లు రావు. ఇది అద్భుతమైన డిజైన్. అందుకే దీర్ఘకాలంలో బిట్‌కాయిన్ ధర పెరుగుతుందని నేను నమ్ముతున్నాను” అని కియోసాకి వ్యాఖ్యానించారు. తాను బిట్‌కాయిన్‌ను ప్రారంభ దశలోనే కొనుగోలు చేశానని, అదే సమయంలో గోల్డ్‌ మైనింగ్‌, చమురు తవ్వకాలు వంటి సంప్రదాయ పెట్టుబడులను కూడా కొనసాగిస్తున్నానని తెలిపారు.

ఫియాట్ కరెన్సీలపై తనకు నమ్మకం లేదని, ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితుల నుంచి రక్షణనిచ్చే “హార్డ్ అసెట్స్”కే తాను మద్దతు ఇస్తానని కియోసాకి మరోసారి స్పష్టం చేశారు. అయితే నిపుణులు మాత్రం, కేవలం కొరత మాత్రమే ధరలు పెరగడానికి హామీ ఇవ్వదని, డిమాండ్, నియంత్రణలు, మార్కెట్ ఊగిసలాటలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడుతున్నారు.

అయినప్పటికీ, బిట్‌కాయిన్‌ను బంగారానికి ప్రత్యామ్నాయంగా చూసే ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోందని కియోసాకి వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)