Breaking News

ప్రపంచ దేశాల్లో వణుకుపుట్టిస్తున్న భారత్ నిర్ణయం - బియ్యం ధరల్లో పెనుమార్పులు!

Published on Sat, 07/22/2023 - 12:24

ప్రపంచంలో అతి పెద్ద బియ్యం సరఫరాదారుగా ఉన్న భారత్ పెరుగుతున్న ధరలను అదుపులో ఉంచేందుకు ఎగుమతులను నిషేధించింది. ఈ కారణంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా అమెరికా వంటి అగ్ర రాజ్యాలు కూడా ఈ ప్రభావానికి గురయ్యాయి. 

ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో 40% వాటా కలిగి ఉన్న ఇండియా ఎగుమతులను నిలిపివేయడంతో ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. ఒక మెట్రిక్ టన్ను ధరలు కనిష్టంగా 50 డాలర్లు నుంచి 100 డాలర్లు ఎక్కువ ఉండవచ్చని సింగపూర్‌కు చెందిన అంతర్జాతీయ వ్యాపార సంస్థలో ఒక వ్యాపారి వెల్లడించారు. కాగా ఈ ధరలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనేది మున్ముందు తెలియాల్సి ఉందని మరొకరు అభిప్రాయపడ్డారు.

బియ్యం ఎగుమతులను నిషేధించాలని భారతదేశం తీసుకున్న నిర్ణయం ప్రపంచ గోధుమ మార్కెట్‌లో బలమైన లాభాలను తీసుకు వస్తోంది. ఈ కారణంగానే గోధుమ ధరలు కూడా ఈ వారంలో 10 శాతం కంటే ఎక్కువ పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచంలోని దాదాపు 3 బిలియన్ల కంటే ఎక్కువ మంది వరి మీద ఆధారపడి జీవిస్తున్నారు. సుమారు 90 శాతం నీటి ఆధారంగా పెరిగే ఈ పంట దాదాపు ఎక్కువ భాగం ఆసియా ఖండంలో ఉత్పత్తవుతుంది. 

(ఇదీ చదవండి: ఆత్మీయుల మరణంతో సన్యాసం - ఓ కొత్త ఆలోచనతో వేల కోట్లు!)

ఇక ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఎగుమతిదారు అయిన థాయ్‌లాండ్‌, కొత్త ఒప్పందాలపై సంతకం చేయడానికి ముందు ధరలను తెలుసుకోవడానికి సరఫరాదారులు వేచి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా దేశాల్లో బియ్యం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. వియాత్నం, సింగపూర్ వంటి దేశాల్లో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
చదవండి:  భారత్‌ బ్యాన్‌ డెసిషన్‌.. యూఎస్‌లో బియ్యం కష్టాలకు అసలు కారణం ఇదే..

Videos

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)