Breaking News

పటిష్టంగా భారత్‌ ఆర్థిక వ్యవస్థ 

Published on Sun, 10/26/2025 - 05:07

ముంబై: అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్న తరుణంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా నిలబడినట్టు ఆర్‌బీఐ అక్టోబర్‌ బులెటిన్‌ తెలిపింది. ‘‘అమెరికాలో వాణిజ్య, ఆర్థిక పరమైన అనిశ్చితులు పెరిగాయి. అయినప్పటికీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తానికి కుదురుగా ఉంది. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి తలెత్తడం, అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ కొనసాగుతుండడంతో అక్టోబర్‌లో పెట్టుబడిదా రుల సెంటిమెంట్‌ దెబ్బతిన్నది. 

ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు చూపించింది. పట్టణ డిమాండ్‌ కోలుకుంటున్నట్టు, గ్రామీణ వినియోగం బలంగా ఉన్నట్టు ముఖ్యమైన సూచికలు తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ భా రత ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్త ప్రతికూలతలకు దూరంగా ఉండలేదు. కానీ, స్థూల ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండడం, ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి చేరడం, బ్యాంకులు, కార్పొరేట్ల బ్యాలన్స్‌ షీట్లు పటిష్టంగా ఉండడం, తగినంత విదేశీ మారక నిల్వలు, విశ్వసనీయమైన ద్రవ్య, పరపతి కార్యాచరణతో భారత్‌ గట్టిగా నిలబడగలిగింది’’అని ఆర్‌బీఐ తన బులెటిన్‌లో పేర్కొంది.  

సంస్కరణల మద్దతు 
అక్టోబర్‌ 1 నాటి మానిటరీ పాలసీ కమిటీ తీర్మానం ప్రకారం వృద్ధి అవకాశాలు బలంగానే ఉన్నట్టు ఆర్‌బీఐ బులెటిన్‌ తెలిపింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొన్నప్పటికీ.. దేశీ చోద కాలు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. దేశీయంగా చేపడుతున్న సంస్కరణలను ప్రస్తావించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధికి మద్దతుగా ఆర్‌బీఐ రేట్ల తగ్గింపునకు అవకాశాలున్నట్టు పేర్కొంది. డాలర్‌తో రూపాయి విలువ ఇటీవల క్షీణించినట్టు పే ర్కొంటూ.. వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిపోవడం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు స్థిరంగా బయ టకు వెళుతుండడాన్ని ప్రస్తావించింది. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు వరుసగా మూడో నెల సెపె్టంబర్‌లో ప్రతికూలంగా నమోదైనట్టు తెలిపింది.  ఈ బులెటిన్‌లోని అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమే కానీ, అధికారికమైనవి కావని ఆర్‌బీఐ పేర్కొంది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)