Breaking News

అదానీ, అంబానీలపై రామ్‌దేవ్‌ బాబా కీలక వ్యాఖ్యలు

Published on Mon, 02/20/2023 - 11:00

వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా తాజాగా కార్పొరేట్‌లపై కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్‌లు తమ సమయాన్ని 99 శాతం స్వప్రయోజనాల కోసమే కేటాయిస్తున్నారని, కానీ తమ లాంటి వారు అందరికీ మేలు చేసేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు.

పతంజలి ఆయుర్వేద సంస్థ సీఈవో, తన సహాయకుడు ఆచార్య బాలకృష్ణకు గోవాలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న రామ్‌దేవ్ బాబా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

‘నేను హరిద్వార్ నుంచి వచ్చి మూడు రోజులుగా ఇక్కడ ఉంటున్నాను. నా సమయం విలువ అదానీ, అంబానీ, టాటా, బిర్లాల కంటే ఎక్కువ. కార్పొరేట్లు తమ సమయాన్ని 99 శాతం స్వప్రయోజనాల కోసమే వెచ్చిస్తారు. కానీ మా లాంటివారు అలా కాదు’ అని రామ్‌దేవ్‌ బాబా పేర్కొన్నట్లు పీటీఐ వార్తా కథనం పేర్కొంది. 

ఆచార్య బాలకృష్ణ తన నైపుణ్యంతో పతంజలి సంస్థకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.40 వేల కోట్ల టర్నోవర్ సాధించారని అభినందించారు. పతంజలి వంటి సంస్థలతో భారత్‌ పరమ వైభవశాలిగా మారుతుందన్నారు.

Videos

కలర్ ఫుల్ బ్యూటీస్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నరాలు తెగే హైప్ ఇచ్చిన హృతిక్ రోషన్

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య ఎమోషనల్..

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్

రేపట్నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం

Liquor Case: రాజకీయ కక్ష అని తేలితే...? సుప్రీం సీరియస్

Miss World 2025: అందం అంటే..!

మాట నిలబెట్టుకున్న జగన్.. ఆర్మీ జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల చెక్

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ రిప్లై

సమంత లవ్ స్టోరీలో బిగ్ ట్విస్ట్?

Photos

+5

Miss World 2025 : ఎకో పార్క్ కు ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)

+5

'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' హీరో క్యూట్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

Subham Success Meet : శుభం సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

నెల్లూరులో ప్రసిద్ధ ఆలయం..శనివారం ఒక్కరోజే భక్తులకు దర్శనం (ఫొటోలు)

+5

'వచ్చినవాడు గౌతమ్‌' సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

సుందరీమణుల మనస్సు దోచిన 'పోచంపల్లి చీరలు'..ఫ్యాషన్ షో అదరహో (ఫొటోలు)

+5

సరస్వతి పుష్కరాలు.. కాళేశ్వరంలో సీఎం రేవంత్‌ పర్యటన (ఫొటోలు)

+5

Miss World 2025 : యాదగిరిగుట్ట, పోచంపల్లిలో మిస్‌ వరల్డ్‌ బ్యూటీస్‌ సందడి (ఫొటోలు)

+5

బర్త్ డే పార్టీ ఫోటోలు షేర్ చేసిన యాంకర్ రష్మీ గౌతమ్ (ఫొటోలు)

+5

డ్యాన్సింగ్‌ క్వీన్‌ 'మాధురీ దీక్షిత్‌' బర్త్‌డే.. ఈ విషయాలు తెలుసా?