ఈసారి మేడ్‌ ఇన్‌ ఇండియా రాఖీలదే హవా.. ఏకంగా రూ.17000 కోట్ల బిజినెస్‌

Published on Fri, 08/08/2025 - 16:26

రాఖీ (రక్షాబంధన్) పండుగ వస్తుందంటే.. మార్కెట్లు కోలాహలంగా మారిపోతాయి. తోబుట్టువులు రాఖీలు కొనుగోలు చేస్తే.. వారి కోసం అన్నదమ్ములు గిఫ్ట్స్ కోనేస్తుంటారు. ఈ సంవత్సరం రాఖీ సందర్భంగా దేశవ్యాప్తంగా రూ. 17,000 కోట్ల కంటే ఎక్కువ వ్యాపారం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) తెలిపింది.

''ఈ సంవత్సరం మార్కెట్లలో చైనీస్ రాఖీలు, వస్తువులు కనిపించడం లేదు" అని CAIT సెక్రటరీ జనరల్ & చాందినీ చౌక్ ఎంపీ 'ప్రవీణ్ ఖండేల్వాల్' పేర్కొన్నారు. వినియోగదారులు కూడా చాలావరకు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఎంచుకుంటున్నారని అన్నారు.

రక్షా బంధన్ కేవలం సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు మాత్రమే కాదు, జాతీయవాదానికి కూడా ప్రతీకగా నిలిచింది. ఈ కారణంగానే ఈ సీజన్‌లో మోదీ రాఖీ, ఆపరేషన్ సిందూర్ రాఖీ, ఆత్మనిర్భర్ భారత్ రాఖీలు, డిజిటల్ రాఖీలు కనిపిస్తున్నాయి. విత్తనాలు, ఖాదీ, వెదురు, పత్తితో తయారు చేసిన పర్యావరణ అనుకూల రాఖీలకు అధిక డిమాండ్ ఉంది. వీటిలో చాలా వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా వ్యవస్థాపకులు, చేతివృత్తులవారు, స్వయం సహాయక బృందాలు చేతితో తయారు చేసినవే ఉన్నాయి.

ఇదీ చదవండి: బాండ్లు సురక్షితం కాదు: పెట్టుబడికి మార్గం ఏదంటే..

రాఖీలు మాత్రమే కాకుండా.. స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, గిఫ్ట్ హ్యాంపర్లు, అలంకరణ వస్తువులు వంటి వస్తువుల ద్వారా ఏకంగా రూ.4,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని కైట్ అంచనా వేసింది. ఢిల్లీ, జైపూర్, ముంబై, లక్నో అంతటా ఎక్కువగా దేశభక్తి ఇతివృత్తాలతో కూడిన రాఖీల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. రక్షాబంధన్ భారతదేశంలో అత్యంత బలమైన పండుగ సీజన్లలో ఒకటిగా ఉంటుందని వ్యాపారులు ఆశాభావంతో ఉన్నారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)