Breaking News

‘మనెవ్వరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చు’.. AI ముప్పుపై మస్క్‌

Published on Fri, 05/24/2024 - 14:17

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ముప్పుపై టెస్లా సీఈవో ఎలోన్‌ మస్క్‌ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.  ఏఐ కారణంగా ఉద్యోగం ఓ వ్యాపకంగా మారుతుందన్నారు. ఆ సంక్షోభం నుంచి బయట పడాలంటే అధిక  మొత్తంలో డబ్బు ఉండాల్సిందేనని తెలిపారు.

రోజురోజుకు కొత్త పుంతలు తొక్కతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని కొందరు అంటుంటే.. ఏఐని సమర్ధిస్తూ కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని అంటున్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. ప్రపంచం మెచ్చిన వ్యాపార దిగ్గజాలు మాత్రం కృత్తిమ మేధ వినియోగం వల్లే తలెల్తే ముప్పు గురించి ముందే హెచ్చరిస్తున్నారు. 

ఈ తరుణంలో పారిస్‌లో జరిగిన వివా స్టార్టప్, టెక్ ఈవెంట్‌లో మస్క్ రిమోట్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహుశా మనెవ్వరి ఉద్యోగాలు ఉండకపోవచ్చు. ఉద్యోగం ఓ వ్యాపకంలా మారుతుంది. మీకు కావాల్సిన ఉత్పత్తుల్ని, సేవల్ని రోబోట్‌లు అందిస్తాయి. ఈ అనిశ్చితి నుంచి బయటపడాలంటే  ఖచ్చితంగా డబ్బులు ఉండాలని అన్నారు.  

గత కొన్ని సంవత్సరాలుగా ఏఐ సామర్థ్యాలు వేగంగా అభివృద్ధి చెందాయని, రెగ్యులేటర్‌లు, కంపెనీలు, వినియోగదారులు సాంకేతికతను బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పటికీ తెలుసుకుంటున్నారని ఆయన హైలైట్ చేశారు.

ఉద్యోగాలు లేని భవిష్యత్తులో ప్రజలు మానసికంగా సంతృప్తి చెందుతారన్న  మస్క్ కంప్యూటర్, రోబోట్‌లు మీ కంటే మెరుగ్గా ప్రతిదీ చేయగలిగితే మీ జీవితానికి అర్థం ఉందా? అని ప్రశ్నించారు. 

 

Videos

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)