Breaking News

భారత్‌లో టెస్లా కార్ల తయారీ.. ఎలాన్‌ మస్క్‌కు మెలిక పెట్టిన కేంద్రం!

Published on Sun, 07/23/2023 - 15:13

ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు భారత్‌ భారీ షాకిచ్చింది. భారత్‌లో టెస్లా మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ కోసం రాయితీలు ఇచ్చేలా ప్రత్యేక విధానాలు అమలు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలిపారంటూ పీటీఐ నివేదించింది. తాజా, నిర్ణయంతో భారత్‌లో టెస్లా కార్లను తయారు చేసి విడుదల చేయాలన్న మస్క్‌ కోరికకు బ్రేకులు పడినట్లైంది.   

మేకిన్‌ ఇండియా నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఏసీసీ బ్యాటరీ స్టోరేజ్‌కు సంబంధించి రూ. 18,100 కోట్లు నుంచి రూ. 26,058 కోట్లతో ఆటో, ఆటో విడిభాగాలు, డ్రోన్‌ పరిశ్రమల కోసం పీఎల్‌ఐ కింద ప్రత్యేక పథకాన్ని రూపొందించించింది. 

అయితే, భారత్‌లో టెస్లా కార్లను తయారు చేయాలన్న మస్క్‌ ఆలోచనను స్వాగతిస్తున్నాం. కాకపోతే, దేశీయంగా తయారీ యూనిట్లకు తాము ఎలాంటి ప్రొత్సహకాలు అందిస్తున్నామో, టెస్లాకు సైతం అదే విధమైన రాయితీలు ఉంటాయి. అంతే తప్పా టెస్లా కోసం ఎలాంటి ప్రత్యేక పాలసీలు అమలు చేయడం లేదంటూ మెలిక పెట్టింది.  

మస్క్‌ డిమాండ్‌
2021 నుంచి ఎలక్ట్రిక్‌ కార్లపై భారత్‌ దిగుమతి సుంకం తగ్గించాలంటూ టెస్లా డిమాండ్‌ చేస్తూ వస్తుంది. అయినప్పటికీ కేంద్రం దిగుమతి సుంకం తగ్గించే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా, ఎలాన్‌ మస్క్‌ భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ ప్లాంట్‌ను ప్రారంభించాలని కోరింది. ఏర్పాటు విషయంలో ప్రభుత్వం సైతం మస్క్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చింది.   

తగ్గేదేలే
భారత్‌లో టెస్లా కార్ల అమ్మకాలపై కేందర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఇప్పటికే ఓ స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. టెస్లా యాజమాన్యం సంస్థ ఎలక్ట్రిక్‌ కార్లను చైనాలో తయారీ చేసి, ఇండియాలో అమ్మకాలు జరుపుతామంటే కుదరదు. ‘టెస్లా భారత్‌కు రావాలి. తయారీ యూనిట్‌ను నెలకొల్పి కార్లను తయారు చేయాలి. ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు.’ ప్రభుత్వ సహాయ, సహకారాలు అందిస్తుందని తెలిపారు. 

కేంద్రం వైఖరి ఇదే
ఈ నేపథ్యంలో అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ టెస్లా బాస్‌ ఎలాన్‌ మస్క్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం భారత్‌లో టెస‍్లా కార్లను తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత టెస్లా అధికారులు ఇక్కడి వచ్చి కేంద్రంతో చర్చలు జరిపారు. ఈ తరుణంలో టెస్లా కార్ల తయారీ యూనిట్‌పై కేంద్రం తన వైఖరి స్పష్టం చేసింది. మరి దీనిపై ఎలాన్‌ మస్క్‌ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

చదవండి👉 భారత్‌లో టెస‍్లా కార్ల ధర మరీ ఇంత తక్కువా!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)