Breaking News

సూచీలకు మాంద్యం భయం 

Published on Fri, 01/20/2023 - 06:46

ముంబై: ఆర్థిక మాంద్యం భయాలతో దేశీయ స్టాక్‌ సూచీల రెండురోజుల ర్యాలీకి గురువారం బ్రేక్‌ పడింది. కేంద్ర బడ్జెట్, రానున్న ప్రధాన కంపెనీల త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వ్యవహరించారు. ఆటో, విద్యుత్, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సెన్సెక్స్‌ 187 పాయింట్లు నష్టపోయి 60,858 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 58 పాయింట్లు పతనమై 17,108 వద్ద నిలిచింది.

అయితే ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఐటీ రంగ షేర్లకు స్వల్ప  కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ లాభ, నష్టాల మధ్య కదలాడాయి. సెన్సెక్స్‌ 60,716 వద్ద కనిష్టాన్ని, 61,032 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 18,064 – 18,155 పరిధిలో కదలాడింది. అమెరికా తయారీ రంగ, రిటైల్‌ అమ్మకాలు మెప్పించకపోవడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. 

మార్కెట్లో మరిన్ని సంగతులు  

►డిసెంబర్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఏషియన్‌ పెయింట్స్‌ షేరు 3% నష్టపోయి రూ.2,868 వద్ద స్థిరపడింది. 

► ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఎఫ్‌పీఓ) ప్రకటన తర్వాత అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనవుతుంది. బీఎస్‌ఈలో నాలుగుశాతం క్షీణించి రెండు నెలల కనిష్ట స్థాయి రూ.3462 వద్ద స్థిరపడింది.  

►బలమైన ఆదాయాల వృద్ధి నమోదు ఆశలతో ఓఎన్‌జీసీ షేరు రెండు శాతం పెరిగి ఆరు నెలల గరిష్టం రూ.152 వద్ద స్థిరపడింది.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)