Breaking News

భారీగా తగ్గిన నెట్‌ఫ్లిక్స్‌ సబ్ స్క్రిప్షన్ ఛార్జీలు!

Published on Sat, 02/25/2023 - 13:18

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. చేజారిపోతున్న సబ్‌స్కైబర్ల సంఖ్యను పెంచేలా 30 కి పైగా దేశాల్లో  సబ్ స్క్రిప్షన్ ఛార్జీలను తగ్గించింది. ఈజిప్ట్‌, యెమెన్,జోర్డాన్‌, లిబియా, ఇరాన్, కెన్యా, క్రొయేషియా,స్లోవేనియా, బల్గేరియా, నికరాగ్వ, ఈక్వెడార్, వెనుజెలా, మలేసియా, ఇండోనేసియా, వియత్నాం, థాయ్‌లాండ్‌తో పాటు మరికొన్ని దేశాల్లో సబ్‌స్క్రిప్షన్ ఫీజును భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. అయితే తగ్గించిన దేశాల్లో భారత్‌ లేకపోవడం గమనార్హం. 

ఓటీటీ దిగ్గజం గత కొంత కాలంగా పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై సర్‌ ఛార్జీలు వసూలు చేస్తుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సబ్‌స్క్రిప్షన్‌ చేసుకునే వారి సంఖ్య భారీగా తగ్గింది. దీంతో యూజర్లను తిరిగి రాబట్టుకునేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సెంట్రల్‌ అండ్‌ సౌత్‌ అమెరికా, సబ్ సహారన్ ఆఫ్రికా , మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా, సెంట్రల్ అండ్ ఈస్ట్రన్ యూరప్ , ఏసియా పసిఫిక్ లాంటి రీజియన్స్‌లో 20 నుంచి 60 శాతం వరకు  ఛార్జీలను  తగ్గించింది.

ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం మాట్లాడుతూ.. ప్రతి నెలా బేసిక్‌ ప్లాన్‌ను కొత్తగా వచ్చే యూజర్లకు, ఇప్పటికే వినియోగిస్తున్న యూజర్లు 28 మలేసియన్ రింగిట్స్‌కే అదిస్తున్నట్లు ట్వీట్‌ చేయగా.. ఇండియన్‌ కరెన్సీలో రూ.653 చెల్లించాల్సి ఉంది. కాగా, గతంలో నెట్‌‌ఫ్లి‌క్స్ ప్లాన్ బేసిక్ ధర 35 మలేసియన్ రింగిట్స్ ఉండేది.

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)