Breaking News

ఇన్‌స్టాలో స్క్రోల్ చేసేవారికి జాబ్!

Published on Mon, 08/25/2025 - 15:39

ఎక్కడైనా మంచి ఉద్యోగం తెచ్చుకోవాలంటే రాత పరీక్షలు & ఇంటర్వ్యూలు వంటివి ఉంటాయి. కానీ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఎక్కువ సమయం గడిపే వాళ్ళకే ఉద్యోగం అంటూ.. మాంక్ ఎంటర్‌టైన్‌మెంట్ కో ఫౌండర్, సీఈఓ 'విరాజ్ శేత్' పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక సోషల్ మీడియా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విరాజ్ శేత్ ఇటీవలి సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ చేశారు. ఇందులో "డూమ్-స్క్రోలర్" కోసం, అంటే సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే వ్యక్తి కోసం చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థి రోజుకు కనీసం ఆరు గంటలు ఇన్‌స్టా, యూట్యూబ్‌లో స్క్రోలింగ్ చేస్తుండాలి. (డూమ్-స్క్రోలర్లు అంటే.. ఫోన్ స్క్రీన్ స్కోల్ చేస్తూ ఉండేవారు).

నైపుణ్యాల విషయానికి వస్తే.. హిందీ, ఇంగ్లీష్ భాషలలో పట్టు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాపై మంచి పట్టును కలిగి ఉండాలి. క్రియేటర్ కల్చర్ మీద ఆసక్తి ఉండాలని విరాజ్ శేత్ వెల్లడించారు. ఎక్సెల్ ఉపయోగించడం కూడా బాగా తెలుసుండాలని చెప్పారు. ఉద్యోగం చేయాల్సిన ప్రదేశం ముంబై అని, ఇది ఫుల్ టైమ్ జాబ్ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: డబ్బు అదా చేయడానికి 10-30-50 రూల్: రాధిక గుప్తా

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇన్‌స్టాలో ఎక్కువ టైమ్ కేటాయించేవారికి కూడా ఉద్యోగాలు ఉన్నాయా అంటూ కొందరు ఆశ్చర్య పోతున్నారు. సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం చెడు వ్యసనం కాదని మా అమ్మతో చెబుతాను, అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇంకొకరు నేను 19 గంటలు సమయం కేటాయిస్తాను, ఇది సరిపోతుందా అని అన్నారు.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)