Breaking News

ఎన్వీడియాకు గూగుల్‌ గట్టి దెబ్బ

Published on Wed, 11/26/2025 - 19:27

మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్ తన ఏఐ డేటా సెంటర్లలో గూగుల్ టెన్సర్ ఏఐ చిప్‌లను వాడేందుకు బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృ సంస్థ మెటా ఈ కీలక నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం ఏఐ కంప్యూటింగ్ రంగంలో టాప్‌లో ఉన్న ఎన్వీడియాకు గట్టి దెబ్బ తగలబోతుందని కొందరు అంచనా వేస్తున్నారు.

2027లో ఏఐ డేటా సెంటర్లలో గూగుల్‌ టీపీయూలు

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం మెటా తన ఏఐ డేటా సెంటర్లలో 2027 నాటికి గూగుల్‌ టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లను(TPU) ఉపయోగించేందుకు చర్చలు జరుపుతోంది. దాంతోపాటు వచ్చే ఏడాది గూగుల్ క్లౌడ్ నుంచి కూడా ఈ చిప్‌లను మెటా అద్దెకు తీసుకునే అవకాశం ఉంది. గూగుల్ ఇప్పటికే ఆంత్రోపిక్ పీబీసీకి 1 మిలియన్ టెన్సర్ చిప్‌లను సరఫరా చేస్తోంది.

గూగుల్‌ టెన్సర్‌

ఏఐ పనుల కోసం దాదాపు 10 సంవత్సరాల క్రితం టెన్సర్ చిప్‌ను గూగుల్ అభివృద్ధి చేసింది. ఎన్వీడియా చిప్‌లపై అతిగా ఆధారపడటంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఏఎండీ వంటి ప్రత్యర్థులు ఉన్నప్పటికీ గూగుల్‌ టెన్సర్ చిప్స్ ఊపందుకుంటున్నాయి.

ఎన్వీడియా చిప్స్

ఎన్వీడియా బ్లాక్‌వెల్ వంటి చిప్‌లు ప్రాథమికంగా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌లు (GPU). ఇవి గత దశాబ్దంలో వీడియో గేమ్‌లకు కీలకంగా ఉండేవి. లార్జ్‌ డేటాను నిర్వహించగల సామర్థ్యం కారణంగా ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఇవి చాలా అనుకూలంగా మారాయి.

ఇదీ చదవండి: బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్‌.. వివరాలివే..

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)