Breaking News

భారీ షాక్‌.. ఇకపై మెటా,ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు డబ్బులు కట్టాల్సిందే!

Published on Tue, 10/03/2023 - 17:12

ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం మెటా (ఫేస్‌బుక్‌) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎక్స్‌ (ట్విటర్‌) తరహాలో మెటా, ఇన్‌స్టాగ్రామ్‌ను వినియోగించుకోవాలంటే నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ చెల్లించేలా కొత్త చెల్లింపు పద్దతిని అమలు చేయనుందని సమాచారం. 

అయితే, ఈ సబ్‌ స్క్రిప్షన్‌ విధానం యాడ్స్‌ వద్దనుకునే యూజర్లు మాత్రమే నెలవారీ చొప్పున కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే యూరప్‌ దేశాలకు చెందిన మెటా, ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ల నుంచి  యాడ్‌- ఫ్రీ ఎక్స్‌పీరియన్స్‌ పేరుతో మెటా నెలకు రూ.1,165 వసూలు చేస్తుంది. 

మరి ఆసియా దేశాల్లో అతిపెద్ద సోషల్‌ మీడియా మార్కెట్‌గా కొనసాగుతున్న భారత్‌లోని యూజర్లకు ఈ సబ్‌స్క్రిప్షన్‌ విధానం ఉంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే భద్రత దృష్ట్యా భారత్‌ యాడ్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్‌కు అనుమతి ఇవ్వనుందనే అంచనాలు నెలకొన్నాయి. 

యూరప్‌లో మెటా నోయాడ్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధరలు 
పలు నివేదికల ప్రకారం.. డెస్క్‌టాప్ పరికరాలలో ప్రకటనలు లేకుండా మెటా లేదా ఇన్‌స్ట్రాగ్రామ్‌ని యాక్సెస్ చేయాలనుకునే వినియోగదారుల నెలకు 10.46 డాలర్లకు సమానమైన సుమారు 10 యూరోల సబ్‌స్క్రిప్షన్ ఫీజును వసూలు చేయాలని మెటా ఆలోచిస్తోంది. ఒకటి కంటే ఎక్కువ సోషల్‌ మీడియా అకౌంట్స్‌ ఉంటే వారి వద్ద నుంచి ఒక్కో ఖాతాకు దాదాపు 6 యూరోల అదనపు ఛార్జీని విధించవచ్చు. మొబైల్  యూజర్ల సబ్‌స్క్రిప్షన్‌ ధర నెలకు దాదాపు 13 యూరోలకు పెరగవచ్చని అంచనా.


 
కమిషన్ల భారం తగ్గించుకునేందుకే
యాపిల్‌, గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఉదాహరణకు మెటా,ఇన్‌స్ట్రాగ్రామ్‌, వాట్సాప్‌ యాప్స్‌ను యూజర్ల కోసం అందుబాటులో ఉన్నాయి. ఆ యాప్స్‌ను తమ ప్లేస్టోర్‌లలో ఉంచేందుకు గూగుల్‌, యాపిల్‌ సంస్థలు మెటా నుంచి కమిషన్‌ తీసుకుంటుంది. ఇప్పుడా కమిషన్‌ ఛార్జీలు పెంచడంతో .. ఆ భారాన్ని తగ్గించుకునేందుకు మెటా నోయాడ్స్‌ అంటూ కొత్త పేమెంట్‌ మెథడ్‌ అస్త్రాన్ని వదిలింది.

చదవండి👉 కోర్టు హాలులో గూగుల్‌పై విరుచుకుపడ్డ మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల!

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)