Breaking News

ఉద్యోగులను తొలగిస్తున్న మెటా

Published on Thu, 10/17/2024 - 12:37

టెక్నాలజీ పరిశ్రమలో ఉద్యోగాల తొలగింపునకు అంతం లేకుండా పోతోంది. ఓ వైపు వేలాదిగా ప్రకటిత కోతలు కొనసాగుతుండగా మరోవైపు అప్రకటిత లేఆఫ్‌ల వార్తలు సైతం వినిపిస్తున్నాయి. తాజాగా టెక్నాలజీ దిగ్గజం మెటా కూడా ఇలాంటి తొలగింపులు చేపట్టింది. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, రియాలిటీ ల్యాబ్‌లతో సహా పలు యూనిట్లలో ఉద్యోగులను తొలగిస్తోందని ఈ విషయం తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ వెర్జ్ నివేదించింది.

దీనిని మెటా ప్రతినిధి ధ్రువీకరించారు. రాయిటర్స్‌కు ఇచ్చిన ప్రకటనలో కంపెనీ దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలు, ప్రాంతీయ వ్యూహాలకు అనుగుణంగా  సర్దుబాటు చేయడానికి తమ బృందాల్లో మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. "ఇందులో కొన్ని బృందాలను వేర్వేరు ప్రదేశాలకు తరలించడం, కొంతమంది ఉద్యోగులను ఇతర పాత్రలకు మార్చడం వంటివి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభావితమైన ఉద్యోగులకు ఇతర అవకాశాలను కనుగొనడానికి మేము కృషి చేస్తాం" అని కంపనీ ప్రతినిధి చెప్పారు.

ఇదీ చదవండి: టీసీఎస్‌.. ఇన్ఫోసిస్‌కు ప్రత్యర్థి కాదా?

కాగా వెర్జ్ రిపోర్టులో తొలగిస్తున్న ఉద్యోగాల సంఖ్యను కచ్చితంగా పేర్కొనలేదు కానీ అవి తక్కువ సంఖ్యలోనే ఉన్నట్లు వెల్లడించింది. తొలగింపు సంఖ్యపై మెటా కూడా వ్యాఖ్యానించలేదు. మరో వైపు, తమ రోజువారీ 25 డాలర్ల భోజన క్రెడిట్‌లను ఉపయోగించి వైన్ గ్లాసులు, లాండ్రీ డిటర్జెంట్‌, ఇతర గృహోపకరణాలను కొనుగోలు చేశారనే ఆరోపణలపై లాస్ ఏంజిల్స్‌లోని మరో రెండు డజన్ల మంది సిబ్బందిని మెటా తొలగించిందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఈ నివేదికపై వ్యాఖ్యానించడానికి మెటా నిరాకరించింది.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)