Breaking News

కొంపముంచుతున్న ‘AI’.. ప్రమాదంలో మహిళా ఉద్యోగులు, సంచలన నివేదికలో

Published on Fri, 07/28/2023 - 16:02

కృత్తిమ మేధ (ai) చాట్‌జీపీటీ రాకతో ప్రపంచ వ్యాప్తంగా జాబ్‌ మార్కెట్‌లో ప్రకంపనలు నెలకొన్నాయి. మనుషుల ఉద్యోగాల్ని ఏఐ భర్తీ చేస్తుందనే భయాలు, ఇప్పటికే పలు రంగాల్లో మనుషుల స్థానాల్ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆక్రమించడమే అందుకు కారణమంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

తాజాగా, మెకిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్‌ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ నివేదికలో రానున్న 10 ఏళ్లల్లో అభివృద్ది చెందుతున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఆటోమెషిన్‌ వంటి టెక్నాలజీలతో ఉద్యోగం చేస్తున్న పురుషుల కంటే మహిళలకే ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాదు, పని ప్రదేశంలో కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్ కారణంగా దాదాపు పది మందిలో ఎనిమిది మంది మహిళలు వేరే కంపెనీకి వెళ్లాల్సి వస్తుందని లేదా ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుందని అధ్యయనంలో గుర్తించింది. 

ఫుడ్‌ సర్వీస్‌, కస్టమర్ కేర్‌, సేల్స్‌, ఆఫీస్‌ సపోర్ట్‌ వంటి రంగాల్లో ఎక్కువ మంది మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. పురుషులతో పోలిస్తే తక్కువ జీతంతో పనిచేస్తున్నప్పటికీ ఆటోమేషన్ కారణంగా ఉపాధి పోయే అవకాశం ఉందని వెల్లడించింది. 2030 నాటికి పురుషుల కంటే మహిళలు చేస్తున్న ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రతికూల ప్రభావం ఎక్కువ శాతం ఉంది.

ఈ గండం నుంచి గట్టెక్కాలంటే ఉద్యోగం చేస్తున్న సంస్థలో కొనసాగాలంటే.. సదరు కంపెనీకి కావాల్సిన నైపుణాలను తెలుసుకొని, ముందే నేర్చుకొని ఉండడం మంచిదన్న అభిప్రాయాన్ని హైలెట్‌ చేసింది. మొత్తం మీద, మెకిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్‌ ఈ సందర్భంగా అమెరికాలో కనీసం 12 మిలియన్ల మంది కార్మికులు 2030 చివరి నాటికి వృత్తులను మార్చుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. 

ఈ ఏడాది మార్చి నెలలో విడుదల చేసిన గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం.. 300 మిలియన్ల ఉద్యోగాలు ఏఐ వల్ల ప్రభావితం కావచ్చని అంచనా వేసింది. చాట్‌జీపీటీలు వంటి టెక్నాలజీలు పోటాపోటీగా మనుషులు రాసే కంటెంట్‌లు.. కృత్తిమ మేధ’ టూల్స్‌ రాస్తాయని, రాబోయే దశాబ్దంలో ఉత్పాదకత మరింత పెరిగే అవకాశం స్పష్టం చేసింది.

చదవండి👉 అంతా చాట్‌జీపీటీ మహిమ.. బ్యాచిలర్స్‌ ఏం చేస్తున్నారో తెలుసా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)