Breaking News

ఎల్‌ఐసీకి లాభాల పంట..14 రెట్లు పెరిగి ఏకంగా..

Published on Fri, 08/11/2023 - 07:27

న్యూఢిల్లీ: జీవిత బీమా రంగ దిగ్గజ సంస్థ ఎల్‌ఐసీ జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 14 రెట్లు పెరిగి రూ.9,544 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.683 కోట్లుగా ఉంది.

ఆదాయం రూ.1,68,881 కోట్ల నుంచి రూ.1,88,749 కోట్లకు వృద్ధి చెందింది. కొత్త పాలసీలపై వచ్చే తొలి ఏడాది ప్రీమియం ఆదాయం తగ్గింది. ఈ రూపంలో జూన్‌ త్రైమాసికంలో వచ్చిన ఆదాయం రూ.6,811 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కొత్త పాలసీల ప్రీమియం ఆదాయం రూ.7,429 కోట్లతో పోలిస్తే సుమారు 9 శాతం క్షీణించింది.

పెట్టుబడుల రూపంలో వచ్చిన నికర ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.69,571 కోట్ల నుంచి రూ.90,309 కోట్లకు పెరిగింది.  సాల్వెన్సీ రేషియో 1.88 శాతం నుంచి 1.89 శాతానికి పెరిగింది. ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడింది. వసూలు కాని నిరర్థక ఆస్తులు 5.84 శాతం నుంచి 2.48 శాతానికి తగ్గాయి. బీఎస్‌ఈలో ఎల్‌ఐసీ షేరు ఫ్లాట్‌గా రూ.642 వద్ద క్లోజయింది. ఫలితాలు మార్కెట్‌ ముగిసిన తర్వాత వెలువడ్డాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)